మరోసారి వివాదంలోకి గేల్
బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఓ మహిళా జర్నలిస్ట్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గేల్... తాజాగా మరోసారి వివాదం సృష్టించుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసభ్యంగా మాట్లాడాడు.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు... జర్నలిస్ట్‌తో ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడాడు. ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులోనే ఇది జరిగింది.