సెయింట్ జోన్స్:వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ చీఫ్ సెలక్టర్ క్లైవ్ లాయిడ్కు మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. క్లైవ్ లాయిడ్ను సెలక్షన్ కమిటీ ప్యానెల్కు చైర్మన్గా నియమించింది. కర్ట్నీ బ్రౌన్ స్థానంలో లాయిడ్ను సెలక్టర్ల చైర్మన్గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బోర్డు స్పష్టం చేసింది. రాబోవు రెండు సంవత్సరాల పాటు లాయిడ్ సెలక్షర్ల చైర్మన్గా కొనసాగుతారని తెలిపింది.
గతంలో విండీస్ బోర్డు డైరెక్టర్ గా, చీఫ్ సెలక్టర్గా లాయిడ్ పని చేసిన సంగతి తెలిసిందే. 2014లో విండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటన ఆద్యంతం వివాదాల నడుమ కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విండీస్ జట్టుకు లాయిడ్ చీఫ్ సెలక్టర్ గా ఉన్నారు.