
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. భారత టాప్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఫైనల్ చేరుకోవడమే దీనికి కారణం. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో సింధు 21–18, 21–8తో మిచెల్లి లీ (కెనడా)పై, సైనా 21–14, 18–21, 21–17తో కిర్‌స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో సింధు, సైనా అమీతుమీ తేల్చుకుంటారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)తో ప్రపంచ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) తలపడనున్నాడు. సెమీఫైనల్స్‌లో శ్రీకాంత్ 21–10, 21–17తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను, లీ చోంగ్ వీ 21–16, 9–21, 21–14తో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించారు.
కాంస్య పతక పోరులో ప్రణయ్ 21–17, 23–25, 9–21తో రాజీవ్ ఉసెఫ్ చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ కాంస్య పతక పోరులో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 19–21తో పెంగ్ సూన్ చాన్–లియు యింగ్ గో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 21–10తో సచిన్ డయాస్–గుణెతిలక (శ్రీలంక) ద్వయంపై గెలిచి నేడు జరిగే స్వర్ణ పతక పోరులో క్రిస్–మార్కస్ (ఇంగ్లండ్) జంటతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment