గ్లాస్గో : కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. నాలుగో రోజు కూడా భారత్ ఓ బంగారు, రజిత పతకాలు సాధించింది. పురుషుల 77 కిలోల వెయిట్‌లిప్టింగ్ విభాగంలో భారత క్రీడాకారుడు సతీష్ శివలింగం బంగారు పతకాన్ని చేజిక్కించుకోగా, రవి కాటులు సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నారు. కాగా ఇప్పటివరకూ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ మొత్తం తొమ్మిది పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. దాంతో పతకాల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఇప్పటివరకూ 6 బంగారు, 9 రజిత, 7 కాంస్యాలతో మొత్తం 22 పతకాలు సాధించింది.