కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులందరినీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి అభినందించారు.
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులందరినీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి అభినందించారు. ఈ క్రీడల్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన రాజ్ సింగ్‌కు పంపిన సందేశంలో ప్రణబ్ పతక విజేతల ప్రదర్శనను కొనియాడారు.
‘కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న వారికి, పతకాలు గెలిచిన వారికి నా హృదయపూర్వక అభినందనలు. పోటీల సందర్భంగా భారత క్రీడాకారులు కనబరిచిన ధృడ సంకల్పం వారి విజయాలకు దోహదం చేసింది’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన గర్వపడేలా చేసింది. పతక విజేతలందరికీ నా అభినందనలు’ అని ప్రధాని నరేంద్ర మోడి ట్వీట్ చేశారు.