హాకీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్ | india lose 4-0 to australia in final of commonwealth games | Sakshi
Sakshi News home page

హాకీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్

Published Sun, Aug 3 2014 6:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

హాకీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్

హాకీ ఫైనల్లో నిరాశపరిచిన భారత్

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు నిరాశపరిచింది. కామన్వెల్త్ 2014 లో భాగంగా ఇక్కడ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ ఘోరంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. డిఫెండింగ్ చాంప్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై భారత్ ఏమాత్రం పోరాటపటిమ ప్రదర్శించకుండా 4-0 తేడాతో ఓటమి పాలై అభిమానులను నిరాశపరిచింది. గత మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఆకట్టుకున్న భారత హాకీ ఆటగాళ్లు ఆస్ట్రేలియాను నిలువరించడంలో విఫలమై టోర్నీలో రజతంతో తృప్తి చెందారు.

 

వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌ల్లోనూ ఫైనల్స్‌కు చేరిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించినా.. తుది మెట్టును అధిగమించడంలో పూర్తి వైఫల్యం చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement