బ్యాడ్మింటన్ ఫైనల్లో మెరిసిన కశ్యప్ | parupalli kashyap wins gold medal in commanwealth game | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ ఫైనల్లో మెరిసిన కశ్యప్

Published Sun, Aug 3 2014 6:07 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

బ్యాడ్మింటన్ ఫైనల్లో మెరిసిన కశ్యప్

బ్యాడ్మింటన్ ఫైనల్లో మెరిసిన కశ్యప్

గ్లాస్కో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ , తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్ 21-14, 11-21, 21-19 తేడాతో డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్నకశ్యప్ బ్యాడ్మింటన్ విభాగంలో తొలి పసిడిని అందించి భారత కీర్తిని రెపరెపలాడించాడు.  ఈ పోటీలో తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న కశ్యప్.. రెండో సెట్ లో దారుణంగా విఫలమైయ్యాడు. అనంతరం నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో కశ్యప్ దూకుడగా ఆడి వాంగ్ ను మట్టికరిపించాడు.

 

ఈ తాజా పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 15 కు చేరింది.  శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 21-17, 21-18తో ప్రపంచ 26వ ర్యాంకర్ రాజీవ్ ఊసెప్ (ఇంగ్లండ్)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement