టీటీలో శరత్ జోడీకి రజతం | CWG 2014: Sharath-Amalraj settle for silver in table tennis men's doubles | Sakshi
Sakshi News home page

టీటీలో శరత్ జోడీకి రజతం

Published Sun, Aug 3 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

టీటీలో శరత్ జోడీకి రజతం

టీటీలో శరత్ జోడీకి రజతం

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్-ఆంథోని అమల్ రాజ్ జోడి రజత పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్-ఆంథోని జంట 11-8, 7-11, 9-11, 5-11తో సింగపూర్‌కు చెందిన యాంగ్ జి-ఝాన్ జియాన్ ద్వయం చేతిలో ఓటమిపాలైంది.
 
  శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో... శరత్ కమల్ 6-11, 8-11, 11-4, 9-11, 11-6, 10-12తో పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) చేతిలో పోరాడి ఓడాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ స్వర్ణంతో సహా మొత్తం ఐదు పతకాలు సాధించిన భారత్ ఈసారి ఆ జోరు చూపలేకపోయింది. కేవలం ఒక పతకంతో సరిపెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement