ఎదురులేని దబంగ్‌ ఢిల్లీ | Dabang Delhi Beats U Mumbai In Pro Kabaddi | Sakshi
Sakshi News home page

ఎదురులేని దబంగ్‌ ఢిల్లీ

Published Thu, Aug 29 2019 10:06 AM | Last Updated on Thu, Aug 29 2019 10:06 AM

Dabang Delhi Beats U Mumbai In Pro Kabaddi - Sakshi

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–7)లో దబంగ్‌ ఢిల్లీ వరుస విజయాలతో టాప్‌లోకి దూసుకొచి్చంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 40–24తో యు ముంబాను చిత్తు చేసింది. ఢిల్లీ తరఫున రైడర్‌ నవీన్‌ 11 పాయింట్లతో అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 9 సార్లు పాయింట్లు తెచి్చపెట్టాడు. డిఫెండర్లలో రవీందర్‌ (8) ప్రత్యర్థి రైడర్లను హడలెత్తించాడు. ఒక్కసారి విఫలమవకుండా ఎనిమిది మందిని విజయవంతంగా టాకిల్‌ చేశాడు. మిగతా వారిలో జోగిందర్‌ నర్వాల్‌ (6), చంద్రన్‌ రంజీత్‌ (4), బలరామ్‌ (2) రాణించారు.

యు ముంబా జట్టులో అర్జున్‌ దేశ్‌వాల్‌ (7) రైడింగ్‌లో ఆకట్టుకోగా... డిఫెండర్‌ సందీప్‌ నర్వాల్‌ 6 పాయింట్లు చేశాడు.  తొలి అర్ధభాగంలో 14–11 స్కోరుతో కేవలం 3 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్న దబంగ్‌ ఢిల్లీ ద్వితీయార్ధంలో చెలరేగి ఆడింది. పది మ్యాచ్‌లాడిన ఢిల్లీకిది ఎనిమిదో విజయం. కేవలం ఒకే మ్యాచ్‌ ఓడిన దబంగ్‌ జట్టు మరో మ్యాచ్‌ను టైగా ముగించింది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 41–25తో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement