
పెర్త్ : దక్షిణాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలో సైతం పదునైన బౌన్సర్లు సంధిస్తున్నాడు. ఎటకారం ఎక్కువై స్టెయిన్‌ను కామెంట్ చేసిన ఓ పాకిస్తాన్ అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టెయిన్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్టెయిన్ ‘ఇప్పటివరకూ జరిగింది చాలు. ఈ టెస్ట్‌ని హాయిగా నా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా. నేనిప్పుడు కుర్చి విమర్శకుడిని అయ్యాను’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఓ పాక్ అభిమాని అత్యుత్సాహంతో ‘‘అవును, ఈ టెస్ట్ సిరీస్‌లో బాబార్ అజమ్ నీ బౌలింగ్‌లో చితక్కొట్టినప్పుడు.. నీకు కచ్చితంగా విరామం కావాల్సిందిలే’’ అంటూ ఎటకారంతో రిప్లే ఇచ్చాడు.
దీనికి స్టెయిన్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ‘‘అవును టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో గెలవడమే నిజంగా చితక్కొట్టించుకోవడమే’’ అంటూ చురకలంటించాడు. ఈ సమాధానంతో సదరు అభిమాని ‘‘నేను నా దేశం పరువు తీసినందుకు క్షమించండి. కానీ నాకు ఆ దిగ్గజం నుంచి రిప్లే కోసం అలా ట్వీట్ చేసాను’’ అని పేర్కొన్నాడు. కాగా స్టెయిన్ రిప్లే నెటిజన్లను ఆకట్టుకుంది. మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టే స్టెయిన్.. సోషల్‌మీడియా తన ట్వీట్లతో అదరగొట్టాడు అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. బాబర్ ఆజమ్ క్రికెట్‌లోకి వచ్చిన బచ్చాగాడని, స్టెయిన్ దిగ్గజ బౌలరని సదరు అభిమానికి హితవు పలుకుతున్నారు. కామెంట్ చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోని చేయాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
You sure need some comfort after that spanking by Babar Azam in the Test series.
— BernaLeo (@MQunClub91011) January 31, 2019
Yes, 3-0 in the test series is a proper spanking. #burn
— Dale Steyn (@DaleSteyn62) January 31, 2019
Sorry Pakistan for getting our country embarrassed but I really wanted a reply from him #Legend🔥🔥😂🤣 https://t.co/rOVM2YeOQj
— BernaLeo (@MQunClub91011) January 31, 2019
Comments
Please login to add a commentAdd a comment