
రికియార్డోకు టైటిల్
బాకు (అజర్‌బైజాన్): రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ డానియల్ రికియార్డో అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో రెండు గంటల 3 నిమిషాల 55.570 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
‘పోల్ పొజి షన్’తో రేసును ప్రారంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బొటాస్ (మెర్సిడెస్), స్ట్రాల్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఒకాన్ ఆరో స్థానాన్ని పొందాడు.