
వైదొలిగిన డేవిడ్ ఫెరర్
మోచేతి గాయం కారణంగా స్పెయిన్ టెన్నిస్ స్టార్, ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. తొలి రౌండ్‌లో అతను జేమ్స్ వార్డ్ (బ్రిటన్)తో ఆడాల్సి ఉంది. ఫెరర్ స్థానంలో ‘లక్కీ లూజర్’ లూకా వాని (ఇటలీ)కి మెయిన్ ‘డ్రా’లో స్థానం దక్కింది.