David Ferrer
-
వైదొలిగిన డేవిడ్ ఫెరర్
మోచేతి గాయం కారణంగా స్పెయిన్ టెన్నిస్ స్టార్, ఎనిమిదో సీడ్ డేవిడ్ ఫెరర్ వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. తొలి రౌండ్లో అతను జేమ్స్ వార్డ్ (బ్రిటన్)తో ఆడాల్సి ఉంది. ఫెరర్ స్థానంలో ‘లక్కీ లూజర్’ లూకా వాని (ఇటలీ)కి మెయిన్ ‘డ్రా’లో స్థానం దక్కింది. -
ఆస్ట్రేలియా ఓపెన్ లో డేవిడ్ ఫెర్రర్ ఓటమి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ తొమ్మిదో నంబర్ క్రీడాకారుడు డేవిడ్ ఫెర్రర్ ఓటమి చెందాడు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఫెర్రర్ 6-3, 6-3, 6-3 తేడాతో కియో నిషీ కోరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ నిషీ కోరీకి పోటీనివ్వని ఫెర్రర్ వరుస సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అంతకుముందు జరిగిన నాల్గో రౌండ్ లో సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ కు చేరగా,విక్టోరియా అజెరెంకా మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా వెనుదిరిగింది. -
సీటీఎల్‌లో పేస్
న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పంజాబ్ మార్షల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వెన్ను నొప్పి కారణంగా డేవిడ్ ఫై (స్పెయిన్) టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో పేస్‌ను తీసుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సోమ్‌దేవ్‌తో, మిక్స్‌డ్‌లో గార్బిని ముగురుజాతో కలిసి పేస్ బరిలోకి దిగుతాడని నిర్వాహకులు తెలిపారు. ‘సీటీఎల్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతుండటంతో టోర్నీలో గట్టి పోటీ తప్పదు. కాబట్టి దీనిపై దృష్టిపెట్టా. మేం కూడా టైటిల్ ఫేవరెట్లలో ఉన్నామని నమ్ముతున్నా’ అని పేస్ వ్యాఖ్యానించాడు.