
దక్షిణాఫ్రికా ఉత్తమ క్రికెటర్‌గా డివిలియర్స్
దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డుల్లో వరుసగా రెండో ఏడాది ఏబీ డివిలియర్స్ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఉత్తమ వన్డే ఆటగాడి అవార్డు కూడా గెలుచుకున్న ఏబీకి మొత్తం ఐదు పురస్కారాలు దక్కడం విశేషం. ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు హషీం ఆమ్లాకు, టి20 క్రికెటర్ అవార్డు మోర్నీ వాన్‌వికు దక్కగా, స్టెయిన్, రోసో ఇతర ప్రధాన అవార్డులు గెలుచుకున్నారు. షబ్నిమ్ ఇస్మాయిల్‌కు ఉత్తమ మహిళా క్రికెటర్ పురస్కారం లభించింది.