న్యూఢిల్లీ: వచ్చే నెలలలో జరుగనున్న సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌కు రెజ‍్లర్లు దీపక్ పూనియా, రవి దహియాలు క్వాలిఫై అయ్యారు. శుక‍్రవారం జరిగిన రెజ్లింగ్ ట్రయల్స్‌లో దీపక్ పూనియా, రవి దహియాలు తమ తమ కేటగిరిల్లో విజయం సాధించడంతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. 86 కేజీల ఫ్రీ స్టైల్ కేటగిరీలో దీపక్ పూనియా.. కామన్వెల్త్ కాంస్య పతక విజేత పవన్ కుమార్‌పై విజయం సాధించగా, 57 కేజీల వెయిట్ కేటగిరీలో రవి దహియా 10-0 తేడాతో పంకజ్‌పై గెలుపొందాడు. దాంతో ఆసియా చాంపియనషిప్‌కు క్వాలిఫై అయ్యారు.
ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వీరిద్దరూ తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌కు సైతం క్వాలిఫై కావడం విశేషం. విజయం తర్వాత దీపక్ దహియా మాట్లాడుతూ.. ‘ ఇదే ఫామ్‌ను కొనసాగించడంపైనే దృష్టి పెట్టా. నా గోల్, నా కల ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే.అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటడానికి వంద శాతం యత్నిస్తా. నా అత్యున్నత ప్రదర్శనను వెలికి తీయడమే నా లక్ష్యం’ అని తెలిపాడు. ‘ నేను రెజ్లింగ్‌ను ఎంజాయ్ చేస్తా. ప్రస్తుతం నా అత్యుత్తమ సమయాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నా. భారత్‌కు పతకాలు అందిస్తానని ఆశిస్తున్నా. ఒలింపిక్ పతకం సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో శ్రమిస్తున్నా’ అని రవి దహియా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment