న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు రఫెల్ నాదల్ కథ ముగిసింది. అర్జెంటీనా ఆటగాడు డెల్ పోట్రోతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆట మధ్యలో మోకాలి గాయంతో బాధపడ్డ నాదల్.. తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
తొలి సెట్‌ను 6-7(3/7) చేజార్చుకున్న నాదల్.. రెండో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. అటు తర్వాత నాదల్ మోకాలి గాయం మరింత ఇబ్బంది పెట్టడంతో టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దాంతో డెల్ పోట్రో ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. 2009లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలిచిన డెల్ పోట్రో.. మరోసారి టైటిల్ పోరుకు సిద్దమయ్యాడు. ఆదివారం జరిగే తుది పోరులో నొవాక్ జొకోవిచ్‌తో పాట్రో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇలా నాదల్ ఈ ఏడాది ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి తప్పుకోవడం రెండోసారి. అంతకుముందు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాదల్ ఇలానే వైదొలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment