శాలిబండ, న్యూస్‌లైన్: విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా గుణాత్మకమైన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్ సూచించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా పాతబస్తీ హుస్సేనీఆలంలోని వెస్ట్రన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో హైదరాబాద్ మహిళ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ మహిళా మండలి ప్రతినిధులు నైనా జైస్వాల్‌ను ఘనంగా సన్మానించారు.
సన్మాన గ్రహీత నైనా జైస్వాల్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారన్నారు. హైకోర్టు న్యాయవాదులు పుష్పేందర్ కౌర్, గమన్‌దీప్ కౌర్‌లతో పాటు హైదరాబాద్ మహిళా మండలి అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మహమ్మదీ బేగంలు మాట్లాడుతూ... అతి చిన్న వయస్సులో నైనా జైస్వాల్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు. ఎనిమిదేళ్లకే ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత సాధించి... 13 ఏళ్లకే డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నైనా జైస్వాల్‌ను విద్యార్థినీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షులు డాక్టర్ మునావర్ సుల్తానా, డెరైక్టర్ మహమ్మద్ ఇమామ్ తహసీన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో ఫలితాలు: నైనా
Published Sat, Mar 15 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement