
ఇంటివాడైన ధావల్ కులకర్ణి
ముంబై: భారత పేసర్ ధావల్ కులకర్ణి గురువారం పెళ్లి పీటలెక్కాడు. ఫ్యాషన్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న శ్రద్ధా ఖర్పుడేను తను వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్ర సంప్రదాయాలకు అనుగుణంగా జరిగిన ఈ వేడుకలకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు వారి సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరికి నాలుగేళ్ల నుంచి పరిచయం ఉంది. సహచర ముంబై ఆటగాడు రోహిత్ శర్మ ట్విట్టర్‌లో కులకర్ణికి శుభాకాంక్షలు తెలిపాడు.
టెన్నిస్ క్రీడాకారిణిని పెళ్లాడిన ఉతప్ప
భారత జట్టులో స్థానం కోల్పోయిన క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు, టెన్నిస్ క్రీడాకారిణి అయిన శీతల్ గౌతమ్‌ను గురువారం పెళ్లాడాడు. గతేడాది నవంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. వివాహానికి పేసర్ ఇర్ఫాన్ పఠాన్, బాలీవుడ్ నటి జూహీచావ్లా హాజరయ్యారు.