'నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతనే' | Dhoni reveals toughest bowler he faced | Sakshi
Sakshi News home page

'నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతనే'

Published Thu, Jun 8 2017 4:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

'నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతనే'

'నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతనే'

లండన్: తన క్రికెటె కెరీర్ లో చాలా సందర్భాల్లో పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడిన విషయాన్ని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ఎంతోమంది గ్రేటెస్ట్ బౌలర్లను సునాయసంగా సమర్ధవంతంగా ఎదుర్కొన్న ధోని.. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కు ఎక్కువగా భయపడేవాడట. ఈ విషయాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల నిర్వహించిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధోని పేర్కొన్నాడు.

 

'మీ కెరీర్లో అత్యంత కఠినమైన బౌలర్ ఎవరు' అనే ప్రశ్నకు అక్తర్ అని ధోని సమాధానమిచ్చాడు. తాను చాలామంది కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్నప్పటికీ, అక్తర్ బౌలింగ్ మాత్రం ప్రత్యేకమని ధోని తెలిపాడు. అందుకు ఒక సింపుల్ రీజన్ చెప్పుకొచ్చాడు మన మిస్టర్ కూల్. 'అతనొక వేగవంతమైన బౌలర్. ఊహించిన విధంగా బంతులు సంధిస్తుంటాడు. యార్కర్లను చాకచక్యంగా వేయగలడు. దాంతో పాటు బౌన్సర్లను సైతం సమర్దవంతంగా సంధించగలడు. కొన్ని సందర్బాల్లో అతను వేసే బీమర్లు అస్సలే అర్దంకావు. నా కెరీర్ లో ఎదురైన కఠినమైన  బౌలర్ అక్తర్'అని ధోని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement