'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే' | Difficult for women to be involved with sportsmen, says Dale Steyn | Sakshi
Sakshi News home page

'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే'

Published Wed, Apr 22 2015 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే'

'ఆడాళ్లకు మాతో వేగడం కష్టమే'

తమలా తరచు ప్రయాణాలు చేసే క్రీడాకారులతో వేగడం ఆడాళ్లకు కష్టమేనని దక్షిణాఫ్రికాకు చెందిన సన్రైజర్స్ ఫాస్ట్బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. కోల్కతా నైట్రైడర్స జట్టుతో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వచ్చిన స్టెయిన్.. మీడియాతో మాట్లాడాడు. జీవితంలో చాలా కాలం పాటు తాము కుటుంబానికి దూరంగానే గడపాల్సి ఉంటుందని, అదే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని అన్నాడు.

అయితే తాను చెప్పేది శృంగార జీవితం గురించి మాత్రం కాదని, అసలు భార్యాభర్తల బంధానికే ఇది కాస్త ఇబ్బందికరమైన విషయమని స్టెయిన్ చెప్పాడు. అసలు ఇంటికి వెళ్తున్నామో, వస్తున్నామో కూడా తెలియకుండా భాగస్వామి గడపడం చాలా కష్టమన్నాడు. ఇక ఇప్పుడు మాత్రం తాను ఏ దేశం వెళ్లాల్సి వచ్చినా ముందుగానే తన భార్యను కూడా అక్కడకు తీసుకొస్తున్నానని తెలిపాడు. తన మాజీ గర్ల్ఫ్రెండ్ కూడా తనతో చాలా తిరిగేదని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement