కేకేఆర్‌కు చావోరేవో | Do or Die Match For KKR Against Mumbai Indians | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌కు చావోరేవో

Published Sun, Apr 28 2019 7:51 PM | Last Updated on Sun, Apr 28 2019 7:52 PM

Do or Die Match For KKR Against Mumbai Indians - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్ఫ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌ 11 మ్యాచ్‌ల్లో ఏడింట విజయం సాధించగా, కేకేఆర్‌ 11 మ్యాచ్‌లకు గాను నాల్గింట మాత్రమే గెలుపొందింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి కేకేఆర్‌ను కలవరపరుస్తోంది. గత మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో కోల్‌కతా ఓటమి పాలైంది. దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడినా అది వృథానే అయ్యింది. ఇది కోల్‌కతాకు చావో రేవో మ్యాచ్‌ కావడంతో ఆ జట్టు తీవ్రంగా శ్రమించక తప్పదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కేకేఆర్‌ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది.

ఆరంభంలో కోల్‌కతా విజయాలు సాధించినా ఆపై వరుస పరాజయాలు చవిచూసింది. ఆ జట్టులో ఆండ్రీ రసెల్‌ ఒక్కడే బ్యాటింగ్‌లో రాణిస్తుండటంతో ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. ఇక ముంబై ఇండియన్స్‌ మాత్రం తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించిన ముంబై ప్లేఆఫ్‌ రేసులోకి వచ్చేసింది. తాజా మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement