
సౌతాంప్టన్: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఒక దశలో ఇంగ్లండ్ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ, సామ్ క్యూరన్ ఏడో వికెటుకు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో మొయిన్ అలీ వెనుదిరగడంతో ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో సామ్ క్యూరన్(78), మొయిన్ అలీ(40) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా, అశ్విన్, ఇషాంత్ శర్మ, షమీలు తలో రెండు వికెట్లు తీశారు. హార్ధిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment