బాసెటెర్: వెస్టిండీస్ పర్యటనను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌తో ముగించింది. మూడు టి20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3–0తో కైవసం చేసుకుంది. ఆఖరి టి20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 13 ఓవర్లలో 71 పరుగులే చేసి ఆలౌటైంది. నలుగురు బ్యాట్స్‌మెన్ క్యాంప్‌బెల్ (11), హోల్డర్ (11), పూరన్ (11), మెక్‌కాయ్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే (4/7) కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో విండీస్‌ను వణికించాడు.
వుడ్ 3, రషీద్ 2 వికెట్లు తీశాడు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో 37, హేల్స్ 20 పరుగులు చేశారు. టి20ల చరిత్రలో విండీస్ చెత్తరికార్డును లిఖించుకుంది. వరుస మ్యాచ్‌ల్లో కనీసం 75 పరుగుల్లోపే ఆలౌటైన జట్టుగా నిలిచింది. రెండో టి20లో విండీస్ 45 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. విల్లేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆల్‌రౌండర్ జోర్డాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
Published Tue, Mar 12 2019 12:23 AM | Last Updated on Tue, Mar 12 2019 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment