
సాక్షి, హైదరాబాద్: సర్దార్ సజ్జన్ సింగ్ సేథీ స్మారక మాస్టర్స్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్లు ఇషా సింగ్, ధనుశ్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఇషా సింగ్ రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటగా... ధనుశ్ రజతం, కాంస్య పతకాలతో ఆకట్టుకున్నాడు. మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇషా సింగ్ 239.5 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచింది. రుచిత (రైల్వేస్; 238 పాయింట్లు), నివేథ (తమిళనాడు; 217 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
జూనియర్ మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో ఇషా సింగ్ 239.7 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా... ప్రియ(హరియాణా; 237 పాయింట్లు) రజతాన్ని, ఖుషీరత్ (పంజాబ్; 217 పాయింట్లు) కాంస్యాన్ని అందుకున్నారు. పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ధనుశ్ శ్రీకాంత్ 248.6 పాయింట్లు స్కోర్ చేసి రజతాన్ని సాధించాడు. యూత్ మెన్ 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ధనుశ్ 227.7 పాయింట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment