‘ఫైనల్ మన మధ్యే జరగాలి’
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని టోనీ అబాట్‌తో కలిసి చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ మైదానాన్ని (ఎమ్‌సీజీ) సందర్శించారు. వారితో పాటు భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, ఆసీస్ మాజీ ఆటగాళ్లు డీన్ జోన్స్, కాస్ప్రోవిజ్, స్టీవ్‌వా, అలెన్ బోర్డర్, మెక్‌గ్రాత్‌లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నెగ్గిన ప్రపంచకప్‌లతో పాటు 2015 ప్రపంచకప్‌తో వారు ఫోటోలు దిగారు.
ఈసారి ప్రపంచకప్ ఫైనల్‌కు ఎమ్‌సీజీ సరైన వేదికని, ఆ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడాలని మోదీ ఆకాంక్షించారు. మహాత్మ గాంధీ చరకాతో కూడిన మెమెంటోతో పాటు, ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్లు కపిల్, ధోని, తన సంతకాలతో కూడిన మూడు బంతులను ఆసీస్ సారథులకు బహుకరించారు. ఇతర అంశాల్లో కూడా ఆస్ట్రేలియన్ల క్రీడా నైపుణ్యాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. ఇరు దేశాల క్రీడా విశ్వవిద్యాలయాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
నరేంద్ర మోదీ, మెల్‌బోర్న్ క్రికెట్ మైదానా, టోనీ అబాట్,