
ఫుట్‌బాల్ బర్గర్స్
సీజన్‌ను బట్టి బిజినెస్‌లో మార్పులు చేసుకోవాలి. ప్రముఖ ఆహార అవుట్‌లెట్ మెక్‌డొనాల్డ్స్ దీనిని బాగా గ్రహించింది.
బ్రెజీలియా: సీజన్‌ను బట్టి బిజినెస్‌లో మార్పులు చేసుకోవాలి. ప్రముఖ ఆహార అవుట్‌లెట్ మెక్‌డొనాల్డ్స్ దీనిని బాగా గ్రహించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా ఓ అడుగు ముందుకేసి తమ రెస్టారెంట్లలో ఫుట్‌బాల్ ఆకారంలో ఉన్న బర్గర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్రెజిల్‌కు వచ్చే వివిధ దేశాల అభిమానుల కోసం ప్రత్యేకంగా బర్గర్స్ తయారు చేస్తోంది. బ్రెజిల్‌లోని 800 మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్లలో వీటిని అందుబాటులో ఉంచుతుంది. వీటికి మెక్ బ్రెజిల్, మెక్ స్పెయిన్, మెక్ జర్మనీ, మెక్ ఫ్రాన్స్, మెక్ ఇటలీ, మెక్ అర్జెంటీనా, మెక్ యూఎస్‌ఏ అనే పేర్లు కూడా పెట్టారు.
గొడ్డు మాంసం, చికెన్, పక్కటెముకల మాంసం, ఇలా పలురకాల నాన్‌వెజ్ బర్గర్లు అందుబాటులో ఉంటున్నాయి. వెరైటీగా ఉన్న బర్గర్లను అభిమానులను లొట్టలేసుకుంటూ తింటున్నారు. అన్నట్టు ఈ బర్గర్లు ఆస్ట్రేలియాలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలోనూ దొరుకుతున్నాయి. మెక్ ఆసీస్‌తో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, అర్జెంటీనా బర్గర్లను అక్కడ సర్వ్ చేస్తున్నారు. సాకర్ అభిమానులు వీటిపై ఆసక్తి చూపుతుండటంతో ప్రపంచకప్ బర్గర్లు విపరీతంగా అమ్ముడు పోతున్నాయి. అయితే ఈ బర్గర్లు ప్రపంచకప్ ముగిసే వరకు కాకుండా ఈ నెల 25 వరకే అందుబాటులో ఉంటాయి.