మాజీ టెస్టు కెప్టెన్లకు సన్మానం
కాన్పూర్: భారత జట్టు 500వ టెస్టు ఆడుతున్న సందర్భంగా బీసీసీఐ తమ మాజీ కెప్టెన్లను సత్కరించింది. అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, కె.శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, మొహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ గౌరవం పొందిన వారిలో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ వీరికి మెమొంటోలు, శాలువాతో సన్మానం చేశారు.
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఇందులో పాల్గొన్నారు. బుధవారం రాత్రి జరిగిన డిన్నర్‌లో మాజీ కెప్టెన్లతో పాటు భారత జట్టు కూడా పాల్గొంది. అరుుతే 22 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన బిషన్ సింగ్ బేడిని, రెండు టెస్టులకు సారథిగా ఉన్న గుండప్ప విశ్వనాథ్‌లను మా త్రం ఈ సన్మానానికి బీసీసీఐ ఆహ్వానించలేదు. ఇది బీసీసీఐ ఈవెంట్ అని, ఎవరిని పిలుచుకోవాలో వారిష్టమని ఈ దిగ్గజాలు తేలిగ్గా తీసుకున్నారు.