మరో కొత్త లీగ్‌కు శ్రీకారం
ఐపీఎల్ చైర్మన్ శుక్లా వెల్లడి
న్యూఢిల్లీ : అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోతున్న చాంపియన్స్ లీగ్ టి20ని పక్కనపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ ఈవెంట్ స్థానంలో సెప్టెంబర్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆయా దేశాల్లోని టి20 లీగ్ విజేతలతో గత ఆరేళ్లుగా సీఎల్‌టి20 జరుగుతున్న విషయం తెలిసిందే. ‘చాంపియన్స్ లీగ్ టి20ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఆ స్థానంలో ప్రత్నామ్నాయ లీగ్‌ను జరపాలని భావిస్తున్నాం.
బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, నేను కలిసి ఏదైనా విభిన్నంగా జరపాలని ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ ముగిశాక ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మా ఆలోచనలు ప్రణాళికా దశలోనే ఉన్నాయి’ అని శుక్లా అన్నారు. 2009లో ప్రారంభ సీఎల్ టి20 నుంచి గతేడాది వరకు ఈ ఈవెంట్ టీవీ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వస్తున్నాయి.
సీఎల్ టి20కి ఫుల్‌స్టాప్
Published Sat, May 16 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement