champions league T20
-
చాంపియన్స్ లీగ్ స్థానంలో మినీ ఐపీఎల్?
ముంబై: విఫల ప్రయత్నంగా మిగిలిన చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ స్థానంలో మరో కొత్త టోర్నమెంట్‌ను నిర్వహించాలా వద్దా అనే అంశంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఈ టోర్నీని నిర్వహించడం కష్టమని ఇప్పటికే బోర్డు వర్గాలు నిర్ణయించినా... ఇంకా అధికారికంగా మాత్రం రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదు. దాంతో సీఎల్‌టి20 అంశాన్ని చర్చించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నెల 8న సమావేశం కానుంది. ఈ టోర్నీకి ప్రతి ఏటా కేటాయిస్తున్న మూడు వారాల సమయాన్ని మరో రకంగా ఉపయోగించుకోవాలనేది బోర్డు పెద్దల ఆలోచన. ఈ నేపథ్యంలో మూడు రకాల ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్‌లాంటిది నిర్వహించడం ఇందులో మొదటిది. మిగతా మూడు జట్లతో లీగ్ మ్యాచ్‌లు, అనంతరం ఫైనల్ ఇందులో ఉంటుంది. ఇదే తరహాలో రెండో ప్రత్యామ్నాయంగా బేబీ ఐపీఎల్ పేరుతో టోర్నీ నిర్వహించడం. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి అనంతరం రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం. ఈ రెండూ కాకుండా ఆ తేదీల్లో వెస్టిండీస్‌ను పిలిచి మరో సిరీస్ ఆడించి గత ఏడాది నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం గురించి వినిపిస్తున్నా...తొలి రెండింటిలో ఒకదానికే కౌన్సిల్ ఓటు వేయవచ్చు. -
'మినీ ఐపీఎల్ ఆలోచన లేదు'
కోల్ కతా: చాంపియన్ లీగ్ (సీఎల్) ట్వంటీ 20 ను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సోమవారం స్పష్టం చేశారు. గత వారం చాంపియన్స్ లీగ్ టి20ని పక్కనపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనన్నారు. ప్రస్తుతం తాము చాంపియన్ లీగ్ కు మరింత మెరుగులు దిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఠాకూర్ పేర్కొన్నారు. క్రికెట్ లో ఉన్న ఆదరణను బట్టి ఇప్పటివరకూ చాంపియన్ లీగ్ ను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియాలలో మాత్రమే నిర్వహించామన్నారు. అయితే మరిన్ని దేశాలలో చాంపియన్ లీగ్ ను విస్తరించి క్రికెట్ కు మరింత వన్నె తేవాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. 'మేము ఇప్పటికీ సీఎల్ ట్వంటీ 20కే కట్టుబడి ఉన్నాం. త్వరలో దీనిపై ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐపీఎల్ దిగ్విజయంగా ముగిసింది. మినీ ఐపీఎల్ పై ఎటువంటి ఆలోచన లేదు. ఇక సీఎల్ ట్వంటీ 20 పైనే మా దృష్టి' అని ఠాకూర్ స్పష్టం చేశారు.చాంపియన్ లీగ్ కు ముగింపు పలుకుతున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. ఆయా దేశాల్లోని టి20 లీగ్ విజేతలతో గత ఆరేళ్లుగా సీఎల్‌టి20 జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఈవెంట్ స్థానంలో సెప్టెంబర్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. -
సీఎల్ టి20కి ఫుల్స్టాప్
మరో కొత్త లీగ్‌కు శ్రీకారం ఐపీఎల్ చైర్మన్ శుక్లా వెల్లడి న్యూఢిల్లీ : అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోతున్న చాంపియన్స్ లీగ్ టి20ని పక్కనపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ ఈవెంట్ స్థానంలో సెప్టెంబర్‌లో కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆయా దేశాల్లోని టి20 లీగ్ విజేతలతో గత ఆరేళ్లుగా సీఎల్‌టి20 జరుగుతున్న విషయం తెలిసిందే. ‘చాంపియన్స్ లీగ్ టి20ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఆ స్థానంలో ప్రత్నామ్నాయ లీగ్‌ను జరపాలని భావిస్తున్నాం. బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, నేను కలిసి ఏదైనా విభిన్నంగా జరపాలని ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ ముగిశాక ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మా ఆలోచనలు ప్రణాళికా దశలోనే ఉన్నాయి’ అని శుక్లా అన్నారు. 2009లో ప్రారంభ సీఎల్ టి20 నుంచి గతేడాది వరకు ఈ ఈవెంట్ టీవీ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. -
ట్రైడెంట్స్కు ఊరట విజయం
బెంగళూరు: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని బార్బడోస్ ట్రైడెంట్స్ విజయంతో ముగించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈ జట్టు గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌ను ఓడించింది. వర్షం కారణంగా బార్బడోస్ విజయలక్ష్యాన్ని (డక్‌వర్త్ లూయీస్ ప్రకారం) 19 ఓవర్లలో 138 పరుగులుగా నిర్ణయించారు. ఫ్రాంక్లిన్ (25 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), కార్టర్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టాస్ ఓడిన నార్తర్న్ డిస్ట్రిక్ట్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఫ్లైన్ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో నార్తర్న్ 11.2 ఓవర్లలో జట్టు 2 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌కు దాదాపు గంట సేపు అంతరాయం కలిగింది. దాంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. అనంతరం ఇన్నింగ్స్ కొనసాగించిన డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. డేవ్‌సిక్ (47 బంతుల్లో 47; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, వాట్లింగ్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (10 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ట్రైడెంట్స్ బౌలర్లలో రవి రాంపాల్ 3 వికెట్లు పడగొట్టాడు. -
సందేహాస్పదంగా మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్
హైదరాబాద్: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. చాంపియన్స్ లీగ్ టి20లో భాగంగా హైదరాబాద్ లో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్- డాల్ఫిన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ శైలిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ చాంపియన్స్ లీగ్ టి20 ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేరకు సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, షాంషుద్దీన్ లతో పాటు థర్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన కూడా నరైన్ క్వికర్ డెలివరీపై సందేహాలు వ్యక్తం చేశారని తెలిపింది. నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారని వెల్లడించింది. ఈ విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత నరైన్ కు అంపైర్లు తెలిపారని పేర్కొంది. నరైన్ తన బౌలింగ్ శైలి సక్రమంగా ఉందో, లేదో నిరూపించుకోవాల్సివుంది. -
లాహోర్‌కు తొలి విజయం
బెంగళూరు: ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్న లాహోర్ లయన్స్... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో డాల్ఫిన్స్ జట్టుపై విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (45 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), నజీమ్ (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆసిఫ్ రజా (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. డాల్ఫిన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లాహోర్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అక్మల్, నజీమ్‌లు ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించడంతో లాహోర్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. ఫ్రిలింక్ 3 వికెట్లు తీశాడు. అనంతరం డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫ్రిలింక్ (27 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) వాయు వేగంతో బ్యాటింగ్ చేశాడు. వాన్ విక్ (29 బంతుల్లో 36; 6 ఫోర్లు), వాండియార్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 93 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో ఫ్రిలింక్స్ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సుబ్రయెన్ (1 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన డాల్ఫిన్స్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఉమర్ అక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
చెన్నై ఆశలు సజీవం
బెంగళూరు: కెప్టెన్ ధోని (16 బంతుల్లో 35; 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు)ల అద్వితీయ పోరాటంతో చాంపియన్స్ లీగ్ టి20లో చెన్నై సూపర్ కింగ్స్ తమ సెమీస్ ఆశలను నిలుపుకుంది. ఓడితే కచ్చితంగా ఇంటిదారి పట్టే మ్యాచ్‌లో... ఈ జోడి ఆటతీరుతో నెగ్గి సెమీస్ రేసులో నిలిచింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌పై 13 పరుగుల తేడాతో చెన్నై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే మెకల్లమ్ (10 బంతుల్లో 11; 1 ఫోర్; 1సిక్స్), రైనా (1) అవుట్ కాగా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధోని, జడేజా రాకతో స్కోరులో కదలిక వచ్చింది. 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదిన ధోని 27 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను జడేజా 6, 4గా మలిచాడు. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై 66 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. కౌల్టర్ నైల్ (21 బంతుల్లో 30; 2 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) యాసిర్ అరాఫత్ 11; మెకల్లమ్ (బి) పారిస్ 11; రైనా (రనౌట్) 1; మన్హాస్ (సి) పారిస్ (బి) హాగ్ 18; బ్రేవో (బి) టర్నర్ 27; జడేజా నాటౌట్ 44; ధోని (సి) టర్నర్ (బి) కౌల్టర్ నైల్ 35; హేస్టింగ్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-15; 2-16; 3-33; 4-56; 5-79; 6-143. బౌలింగ్: పారిస్ 2-0-13-1; కౌల్టర్ నైల్ 4-0-28-1; బీర్ 4-0-16-0; యాసిర్ 4-0-51-1; హాగ్ 4-0-25-1; టర్నర్ 2-0-19-1. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) ధోని (బి) నెహ్రా 13; వోజెస్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 27; ఎగర్ (బి) అశ్విన్ 4; మార్ష్ (సి) జడేజా (బి) అశ్విన్ 19; వైట్మాన్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 5; టర్నర్ (రనౌట్) 22; కౌల్టర్ నైల్ (సి) బ్రేవో (బి) మోహిత్ 30; అరాఫత్ నాటౌట్ 12; పారిస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-18; 2-26; 3-53; 4-68; 5-73; 6-123; 7-131. బౌలింగ్: నెహ్రా 4-0-27-2; అశ్విన్ 4-0-20-3; మోహిత్ 3-0-17-1; జడేజా 4-0-26-0; హేస్టింగ్స్ 2-0-16-0; బ్రేవో 3-0-34-0. -
హరికేన్‌లా ఆడి...
రాయ్‌పూర్: బ్యాటింగ్‌లో ఏడెన్ బ్లిజార్డ్ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు)... బౌలింగ్‌లో హిల్ఫెన్హాస్ (3/14), బొలింజర్ (3/22) మెరిపించడంతో హోబర్ట్ హరికేన్స్ జట్టు దుమ్ము రేపింది. ఫలితంగా మంగళవారం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లో ఆ జట్టు 86 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ పైన్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు; 1 సిక్స్)తో పాటు షోయబ్ మాలిక్ (22 బంతుల్లో45 నాటౌట్; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) చెలరేగారు. ఆరో ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన బ్లిజార్డ్ నార్తర్న్ బౌలర్లను ఊచకోత కోశాడు. 19వ ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. మాలిక్‌తో కలిసి రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 16.4 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. స్కాట్ స్టైరిస్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే హరికేన్స్ బౌలర్లను ఎదుర్కోగలిగాడు. జట్టు బ్యాట్స్‌మెన్‌లో తొమ్మిది మంది కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. చివర్లో సౌతీ (12 బంతుల్లో 21; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఓ మేరకు ఆడినా... నాలుగు బంతుల్లో బొలింజర్ మూడు వికెట్లు తీసి ముగింపు పలికాడు. హిల్ఫెన్హాస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. స్కోరు వివరాలు హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) సౌతీ (బి) కుగ్గెలిన్ 12; పైన్ (సి) బౌల్ట్ (బి) సోధి 43; బ్లిజార్డ్ (సి) స్టైరిస్ (బి) సౌతీ 62; షోయబ్ నాటౌట్ 45; బిర్ట్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-21; 2-68; 3-168. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4-0-46-0; సౌతీ 4-0-29-1; స్టైరిస్ 4-0-28-0; కుగ్గెలిన్ 2-0-22-1; సోధి 4-0-31-1; జోనో బౌల్ట్ 2-0-16-0. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డెవిసిచ్ (సి) లాగ్లిన్ (బి) మెన్నీ 2; విలియమ్సన్ (సి) డోహర్తి (బి) హిల్ఫెన్హాస్ 3; ఫ్లిన్ (బి) హిల్ఫెన్హాస్ 0; వాట్లింగ్ ఎల్బీడబ్ల్యు (బి) హిల్ఫెన్హాస్ 9; మిచెల్ (స్టంప్డ్) పైన్ (బి) డోహర్తి 9; స్టైరిస్ (సి) వెల్స్ (బి) మెన్నీ 37; కుగ్గెలిన్ (బి) డోహర్తి 2; సౌతీ (సి) హిల్ఫెన్హాస్ (బి) బొలింజర్ 21; జొనో బౌల్ట్ (సి) వెల్స్ (బి) బొలింజర్ 1; సోధి (సి) బిర్ట్ (బి) బొలింజర్ 0; ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1-3; 2-5; 3-5; 4-19; 5-59; 6-63; 7-87; 8-92; 9-92; 10-92. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-14-3; మెన్నీ 3-1-10-2; డోహర్తి 4-1-17-2; బొలింజర్ 2.4-0-22-3; లాగ్లిన్ 3-0-25-0. -
కోల్‌కతా జోరు కొనసాగేనా!
- నేడు లాహోర్ లయన్స్‌తో పోరు - మరో మ్యాచ్‌లో హోబర్ట్తో కోబ్రాస్ ఢీ - చాంపియన్స్ లీగ్ టి20 సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చాంపియన్‌గా తమకున్న హోదాను నిలబెట్టుకుంటూ తొలి మ్యాచ్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... చాంపియన్స్ లీగ్టి20లో మరో విజయంపై దృష్టి పెట్టింది. ఈ లీగ్‌లో హైదరాబాద్‌ను హోమ్‌గ్రౌండ్‌గా మార్చుకున్న నైట్‌రైడర్స్ ఆదివారం జరిగే పోరులో లాహోర్ లయన్స్‌తో తలపడనుంది. క్వాలిఫయింగ్ దశలో రెండు మ్యాచ్‌లు నెగ్గి ప్రధాన పోటీలకు అర్హత సాధించిన లయన్స్‌కు ఇదే తొలి మ్యాచ్. నేడు జరిగే మరో మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టు కేప్ కోబ్రాస్‌ను ఎదుర్కొంటుంది. గంభీర్ రాణించేనా? ఐపీఎల్-7ను వరుసగా మూడు డకౌట్లతో ప్రారంభించిన నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ ఈ టోర్నీలోనూ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. టాపార్డర్‌లో అతను కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్, వికెట్‌కీపర్‌గా ఈ మ్యాచ్‌లో బిస్లా స్థానంలో ఉతప్ప వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఉతప్ప పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండేలపై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన ఆండ్రీ రసెల్, డస్కటేలపై కీలక బాధ్యత ఉంది. స్పిన్నర్‌గా నరైన్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను శాసించగల సమర్థుడు. గత మ్యాచ్‌లో 4 ఓవర్లలో అతను కేవలం 9 పరుగులు ఇచ్చాడు. లాహోర్ ఆటగాళ్లు ఈ స్థాయి స్పిన్‌ను ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. తక్కువ స్కోర్ల మ్యాచే అయినా... ఇద్దరు ప్రధాన పేసర్లు కమిన్స్, ఉమేశ్ గత మ్యాచ్‌లో భారీ పరుగులు ఇచ్చారు. అయితే వెంటనే తుది జట్టులో మార్పు ఉండకపోవచ్చు. లయన్స్ నిలబడగలరా క్వాలిఫయింగ్ దశలో ఆటతీరు గమనిస్తే లాహోర్ లయన్స్ జట్టు కూడా మెరుగ్గానే కనిపిస్తోంది. ముంబైపై సునాయాస విజయం సాధించిన ఆ జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్‌ను చిత్తు చేసింది. జట్టు విజయంలో కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతనే జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక ఉమర్ అక్మల్, అహ్మద్ షహజాద్, నాసిర్ జంషెద్లతో పాటు వహాబ్ రియాజ్, అజీజ్ చీమావంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. సాద్ నసీమ్ మరో కీలక ఆటగాడు. సీఎల్‌టి20లో విజయం సాధించి తమదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉంది. శుభారంభం ఎవరిదో ఉప్పల్ స్టేడియంలోనే ఆదివారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కేప్ కోబ్రాస్, ఆస్ట్రేలియా జట్టు హోబర్ట్ హరికేన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లలో ఓటమిపాలయ్యాయి. దాంతో మొదటి విజయం కోసం ఇరు జట్లపై ఒత్తిడి నెలకొని ఉంది. బలాబలాలు చూస్తే రెండు టీమ్‌లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. హరికేన్స్‌లో బ్లిజార్డ్, డంక్, బొలింజర్లతో పాటు పాకిస్థానీ షోయబ్ మాలిక్ గుర్తింపు ఉన్న ఆటగాడు. కోబ్రాస్ టీమ్‌లో దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ హషీం ఆమ్లా, ఫిలాండర్ మినహా చెప్పుకోదగ్గ క్రికెటర్లు ఎవరూ లేరు. లాహోర్ జట్టుకు సానియా ఇంట్లో విందు చాంపియన్స్ లీగ్‌లో ఆడేందుకు నగరానికి వచ్చిన పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్‌కు... శనివారం రాత్రి సానియా ఇంట్లో విందు ఇచ్చారు. ఇదే టోర్నీలో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడుతున్న షోయబ్ మాలిక్... తన అత్తగారింట్లో ఈ విందును ఏర్పాటు చేశాడు. ‘సానియా తో పెళ్లయ్యాక నగరంలో తొలి మ్యాచ్ ఆడుతుండటం ఉద్వేగంగా అనిపిస్తోంది. సానియా విజయాల పట్ల నేను గర్వపడుతున్నాను. ఆమె మరిన్ని గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గాలని కోరుకుంటున్నా’ అని షోయబ్ వ్యాఖ్యానించాడు. -
చెన్నై సూపర్ కింగ్స్
బ్యాట్‌తో హెలికాప్టర్ షాట్లే కాదు బంతితో అదరగొడతానంటున్నాడు ధోని. చాంపియన్స్ లీగ్ టీ20లో భాగంగా ఈ రోజు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో సరదాగా బౌలింగ్ చేసిన ధోని బంతిని గింగిరాలు తిప్పుతూ ఉల్లాసంగా కనిపించాడు. -
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పొలార్డ్
రాయపూర్: ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా వెస్టిండీస్ డాషింగ్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ నియమితుడయ్యాడు. చాంపియన్ లీగ్ టి20లో జట్టుకు అతడు నాయకత్వం వహిస్తాడు. భుజం, చేతివేళ్ల గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో పొలార్డ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లో లాహోర్ లయన్స్ తో తలపడుతుంది. శనివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మొహాలీ, రాయ్‌పూర్‌లలో కలిపి మొత్తం 29 మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, ఆ తర్వాత బుధవారం నుంచి ప్రధాన పోటీలు నిర్వహిస్తారు. అక్టోబర్ 4న ఫైనల్ జరుగుతుంది. -
‘టాప్’ రాయల్స్
సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్లో ఈ మైదానంలో ఓటమి లేకుండా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గిన రాయల్స్, సీఎల్‌టి20లోనూ ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచింది. గ్రూప్ ‘ఎ’ లో అగ్రస్థానంలో నిలిచి జైపూర్‌లోనే సెమీస్ ఆడే అవకాశాన్ని సంపాదించుకుంది. మరో వైపు టి20 క్రికెట్లో వరుసగా పదిహేను విజయాలు సాధించి ఊపు మీదున్న ఒటాగో వోల్ట్స్‌కు బ్రేక్ పడింది. ఇక ముంబై మ్యాచ్ ఫలితంపై ఒటాగో సెమీస్ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి. జైపూర్: చాంపియన్స్ లీగ్ టి20 గ్రూప్ ‘ఎ’లో రాజస్థాన్ రాయల్స్ అజేయంగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ .. వికెట్ల తేడాతో ఒటాగో వోల్ట్ను చిత్తు చేసింది. రాహుల్ శుక్లా (3/23) బౌలింగ్‌లో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒటాగో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. నీషామ్ (25 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అజింక్య రహానే (48 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా... చివర్లో బ్రాడ్ హాడ్జ్ (23 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. రాహుల్ శుక్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు... ఒటాగో తొలి 3 ఓవర్లలో 16 పరుగులు చేసింది. ఈ దశలో రాజస్థాన్ బౌలర్ రాహుల్ శుక్లా చెలరేగి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుక్లా తన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే... రూథర్ ఫోర్డ్ (5), బ్రెండన్ మెకల్లమ్ (0), బూర్డర్ (0)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. ఆ తర్వాతి ఓవర్లో బ్రూమ్ (11)ను వాట్సన్ వెనక్కి పంపడంతో ఒటాగో 21 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో డస్కటే (27 బంతుల్లో 26; 3 ఫోర్లు), నీషామ్ కలిసి జట్టును ఆదుకున్నారు. వరుస ఓవర్లలో వీరిద్దరు పెవిలియన్ చేరగా...చివర్లో నాథన్ మెకల్లమ్ (20 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి వోల్ట్స్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రాణించిన రహానే... తొలి వికెట్‌కు 40 బంతుల్లో 49 పరుగులు జోడించిన అనంతరం ద్రవిడ్ (10) వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సామ్సన్ (5), వాట్సన్ (2), బిన్నీ (1) కూడా అవుట్ కావడంతో ఒక్కసారిగా రాయల్స్ ఇన్నింగ్స్ తడబడింది. అయితే రహానే మాత్రం తన జోరు తగ్గించకుండా చక్కటి స్ట్రోక్‌లతో జట్టును నడిపించాడు. ఈ క్రమంలో 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ దశలో రాయల్స్ వెనకపడ్డట్లు కనిపించినా... హాడ్జ్ సంచలన హిట్టింగ్తో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) సామ్సన్ (బి) వాట్సన్ 11; రూథర్‌ఫోర్డ్ (బి) శుక్లా 5; బ్రెండన్ మెకల్లమ్ (ఎల్బీ) (బి) శుక్లా 0; బూర్డర్ (సి) అండ్ (బి) శుక్లా 0; టెన్ డస్కటే (ఎల్బీ) (బి) తాంబే 26; నీషామ్ (సి) వాట్సన్ (బి) కూపర్ 32; నాథమ్ మెకల్లమ్ (నాటౌట్) 28; బట్లర్ (బి) కూపర్ 25; వాగ్నర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-16; 2-20; 3-20; 4-21; 5-74; 6-81; 7-120. బౌలింగ్: మేనరియా 1-0-9-0; ఫాల్క్‌నర్ 4-0-28-0; వాట్సన్ 3-0-24-1; శుక్లా 4-1-23-3; కూపర్ 4-0-33-2; తాంబే 4-0-17-1. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) నాథన్ మెకల్లమ్ (బి) బియర్డ్ 10; రహానే (సి) బ్రూమ్ (బి) నీషామ్ 52; సామ్సన్ (బి) నీషామ్ 5; వాట్సన్ (సి) బూర్డర్ (బి) నీషామ్ 2; బిన్నీ (సి) బ్రెండన్ మెకల్లమ్ (బి) వాగ్నర్ 1; హాడ్జ్ (నాటౌట్) 52; ఫాల్క్‌నర్ (బి) వాగ్నర్ 2; కూపర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-49; 2-67; 3-71; 4-72; 5-116; 6-130. బౌలింగ్: బట్లర్ 3.1-0-37-0; మెక్‌మిలన్ 4-0-26-0; వాగ్నర్ 4-0-33-2; బియర్డ్ 4-0-23-1; నీషామ్ 4-0-22-3. ముంబైకి మంచి చాన్స్ సచిన్ రంగు దుస్తుల్లో తన చివరి మ్యాచ్‌ను నేడు ఆడబోతున్నాడా..? లేక మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ముంబై ఇండియన్స్ చేతుల్లోనే ఉంది. ఒటాగోపై విజయం ద్వారా రాజస్థాన్... ముంబైకి మంచి అవకాశాన్ని అందించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పెర్త్‌పై గెలవడంతో పాటు, రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే... ముంబై నాకౌట్ సమరానికి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ముంబై ఓడిపోతే... పరిమిత ఓవర్ల క్రికెట్లో సచిన్‌కు ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. సీఎల్‌టి20తో మాస్టర్ పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. చాంపియన్స్ లీగ్‌లో నేడు ముంబై x పెర్త్ సా. గం. 4.00 నుంచి చెన్నై x ట్రినిడాడ్ రా. గం. 8.00 నుంచి వేదిక: న్యూఢిల్లీ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సోమవారం నాటి రెండు మ్యాచ్‌లూ రద్దు
అహ్మదాబాద్: చాంపియన్స్ లీగ్ టి20లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ల విషయంలో అభిమానులు తీవ్ర నిరుత్సాహం చెందారు. స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మ్యాచ్‌లను ఆడించేందుకు వీలు కాలేదు. ముందుగా గ్రూప్ ‘ఎ’ లోని పెర్త్ స్కార్చర్స్, హైవెల్డ్ లయన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇదే కారణంగా రద్దయ్యింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం చెరువును తలపించింది. మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇరు జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. అంతకుముందు టాస్ నెగ్గిన లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఆ వెంటనే భారీ స్థాయిలో వర్షం కురవడం ప్రారంభమైంది. గంటన్నర సమయం వరకు వేచి చూసినా ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ముంబై, ఒటాగో మ్యాచ్ కూడా... గ్రూప్ ‘ఎ’లో భాగంగా రాత్రి ఎనిమిది గంటలకు ముంబై ఇండియన్స్, ఒటాగో వోల్ట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయ్యింది. నిరంతరాయంగా కురిసిన వర్షానికి నిర్వాహకులు చేతులెత్తేశారు. టాస్ సమయం 7.30 గంటల వరకు వేచి చూశారు. సాయంత్రం లాగా భారీ వర్షం కురవక పోయినా అంపైర్లు మాత్రం టాస్ వేయించకుండా మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపారు. దీంతో ఇరు జట్లకు రెండేసి పాయింట్లు ఇచ్చారు. దీంతో ఇప్పటికే రాజస్థాన్ చేతిలో ఓడిన ముంబై జట్టుకి సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. -
క్వాలిఫయర్ ‘టాప్’ ఒటాగో
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ మ్యాచుల్లో ఒటాగో వోల్ట్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ జోరుకు పగ్గాలు వేస్తూ శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించడంతో ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్‌లో రైజర్స్ విఫలమైంది. ఈ గెలుపుతో క్వాలిఫయింగ్‌లో వోల్ట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గినట్లయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేయగా, ఒటాగో 16.2 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్ (10 బంతుల్లో 12; 1 సిక్స్)తో పాటు పార్థివ్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు), సమంత్రే (8) వెంట వెంటనే వెనుదిరగడంతో రైజర్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జేపీ డుమిని (38 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), వైట్ (23 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఆ తర్వాత స్యామీ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఫర్వాలేదనిపించడంతో హైదరాబాద్ స్కోరు 143 పరుగులకు చేరింది. అనంతరం బ్రెండన్ మెకల్లమ్ (39 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటి చేత్తో వోల్ట్స్ను గెలిపించాడు. రూథర్ ఫోర్డ్ (23 బంతుల్లో 27; 5 ఫోర్లు), నీషమ్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించడంతో మరో 22 బంతులు మిగిలి ఉండగానే విజయం వోల్ట్స్ సొంతమైంది. -
వోల్వ్స్‌కు ఊరట
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టుకు ఊరటనిచ్చే విజయం దక్కింది. కందురతా మారూన్స్‌తో శుక్రవారం జరిగిన చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో వోల్వ్స్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (60 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు; 5 సిక్స్‌లు) మరోసారి తన సూపర్ ఫామ్ చాటుకున్నాడు. కందురతాపై 10 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. ముందుగా మిస్బా సేన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సల్మాన్ (21 బంతుల్లో 21; 1 ఫోర్) మినహా ఎవరూ పది పరుగులు దాటలేదు. దిల్హారాకు మూడు, కులశేఖరకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కందురతా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 136 పరుగులు చేసింది. సంగక్కర (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తరంగ (27 బంతుల్లో 25; 4 ఫోర్లు), సిల్వ (24 బంతుల్లో 25; 1 ఫోర్; 1 సిక్స్) రాణించారు. ఆదిల్‌కు మూడు, ఇమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆదిలో తడబడినా.. ప్రారంభంలో కందురతా బౌలర్లు వోల్వ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. దీంతో తొలి ఐదు ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఐదో వికెట్‌కు సల్మాన్‌తో కలిసి 74 పరుగులు జత చేశాడు. 16వ ఓవర్లో వరుసగా ఓ సిక్స్, రెండు బౌండరీలు బాది స్కోరును పరిగెత్తించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి ఒంటి చేత్తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కందురతా జట్టు ఆటగాళ్లను వోల్వ్స్ బౌలర్లు ఆటాడుకున్నారు. రెండో ఓవర్లో తరంగ వరుసగా మూడు ఫోర్లతో రెచ్చిపోయినా త్వరగానే అవుటయ్యాడు. ఉన్నంతలో సంగక్కర సమర్థవంతంగానే ఆడినా అటు వైపు నుంచి సహకారం కరువైంది. దీంతోపాటు వరుస విరామాల్లో వికెట్లు నేలకూలడంతో పరాజయం ఖాయమైంది. -
టాప్’ కోసం బరిలోకి
చాంపియన్స్ లీగ్‌లో నేడు కందురతా మారూన్స్ x OòœçÜ-Ìê-»ê§Šl ÐøÌŒæ-ÓSÞ సాయంత్రం 4 గంటల నుంచి సన్‌రైజర్స్ x JsêVø ÐøÌŒætÞ రాత్రి 8 గంటల నుంచి స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20లో ప్రధాన గ్రూప్‌లో చోటు కోసం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒటాగో వోల్ట్స్ (కివీస్) జట్లు తమ ప్రత్యర్థులపై వరుసగా రెండు విజయాలు సాధించి అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో స్థానిక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో శనివారం కందురతా మారూన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ ... సన్‌రైజర్స్, వోల్ట్స్ మధ్య జరిగే మ్యాచ్ లు నామమాత్రంగా మారాయి. కానీ సన్‌రైజర్స్, వోల్ట్స్ మాత్రం ఎలాంటి అలక్ష్యం చూపకుండా తమ దూకుడును కొనసాగించి పట్టికలో అగ్రస్థానం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే రెండు జట్లు ఏ గ్రూప్‌లో ఆడేది నిర్ణయించారు. సన్‌రైజర్స్ జట్టు గ్రూప్ ‘బి’లో చెన్నై, ట్రినిడాడ్, బ్రిస్బేన్, టైటాన్లతో తలపడుతుంది. వోల్ట్స్ జట్టు గ్రూప్ ‘ఎ’లో రాజస్థాన్, ముంబై, లయన్స్, పెర్త్లతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు కందురతా, ఫైసలాబాద్ వోల్స్వ్ జట్లు తమ చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పట్టికలో చివరి స్థానంలో నిలవకుండా చూడాలని అనుకుంటున్నాయి. -
సచిన్ కోసం గెలుస్తాం
జైపూర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరి సారిగా పొట్టి ఫార్మాట్లో కనిపించే టోర్నీగా ఇప్పటికే ఈ సీజన్ చాంపియన్స్ లీగ్ టి20కి కావల్సినంత క్రేజ్ వచ్చింది. దీంతో అటు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ కూడా తమ దిగ్గజ ఆటగాడి కోసం ఈ మెగా ఈవెంట్‌ను గెలిచి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నాడు. ‘సచిన్‌కు ఇది చివరి టి20 టోర్నీ అని మాకు తెలుసు. అందుకే అతడి కోసం మేం మంచి క్రికెట్ ఆడాలని భావిస్తున్నాం. టోర్నీ గెలిస్తే మరీ మంచిది. తన 200వ టెస్టు, రిటైర్మెంట్ గురించి ఇప్పుడే అనవసరం. ఈటోర్నీలో అతడు రాణించాలని కోరుకుంటున్నాను’ అని రోహిత్ అన్నాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై జట్టు తలపడనుంది. కోచ్ జాన్ రైట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘సచిన్ 16 ఏళ్ల వయస్సులో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను తొలిసారిగా చూశాను. తర్వాత 2000లో అదే భారత జట్టుకు నేను కోచ్‌గా మారాను. చాలా ఏళ్లుగా అతడిని నేను దగ్గరగా ఉండి చూశాను. ఆట పట్ల అతని దృక్పథాన్ని ఎన్నడూ మార్చుకోలేదు. అతడి అద్భుత విజయానికి ఇదే కారణం. యువ ఆటగాళ్లు ఈ విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది’ అని రైట్ కొనియాడారు. సచిన్ గొప్ప ఆటగాడే కానీ..: ద్రవిడ్ సచిన్ టెండూల్కర్ అద్భుత ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని, అలాగని తమ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ‘సచిన్, నేను కలిసి ప్రత్యర్థులుగా ఇదివరకే ఆడాం. అలాగే భారత్ తరఫునా కలిసి ఆడాం. కానీ శనివారం జరిగే మ్యాచ్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. రాజస్థాన్, ముంబై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌గానే చూడాల్సి ఉంటుంది. సెమీస్‌లో కూడా మేమే తలపడాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సీఎల్‌టి20ని నా చివరి టోర్నీగా అయితే ఇప్పటిదాకా భావించడం లేదు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. -
‘సన్’రైజ్ అవుతుందా!
ధనాధన్ క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు భారత్‌తోపాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా దేశవాళీ జట్లు సిద్ధమయ్యాయి. మరో రెండు రోజుల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ తర్వాత మరోసారి భారత్ అభిమానులు టి20 క్రికెట్ మజాను రుచి చూడబోతున్నారు. సాక్షి, హైదరాబాద్: పేరు మారడంతో పాటు అదృష్టం కూడా మారిన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. సన్‌రైజర్స్‌గా బరిలోకి దిగి టాప్-4 జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరో టి20 టోర్నీ చాంపియన్స్ లీగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించేందుకు సన్‌రైజర్స్ క్వాలిఫయింగ్ పోటీలు ఆడాల్సి ఉంది. మొహాలీలో మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో కంద్ మారూన్స్‌తో, బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఫైసలాబాద్ వోల్వ్స్తో రైజర్స్ తలపడుతుంది. రైజర్స్ పాత జట్టు డెక్కన్ చార్జర్స్ 2009లో జరిగిన తొలి చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. అందులో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఆ తర్వాత మూడు సార్లు చార్జర్స్ క్వాలిఫై కాలేదు. బౌలింగే బలం... ఐపీఎల్ తరహాలోనే చాంపియన్స్ లీగ్‌లో కూడా సన్‌రైజర్స్ బౌలింగ్‌నే నమ్ముకుంది. ప్రధానాస్త్రం డేల్ స్టెయిన్ చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. లెగ్‌స్పిన్నర్లు అమిత్ మిశ్రా, కరణ్ శర్మ తమ చక్కటి ప్రదర్శనతో ఐపీఎల్లో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు తమ పూర్తి కోటా బౌలింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది. రెండో పేసర్‌గా ఇషాంత్ శర్మతో పాటు తిసారా పెరీరా, డారెన్ స్యామీ, ఆశిష్ రెడ్డివంటి ఆల్‌రౌండర్లతో టీమ్ సమతూకంగా ఉంది. తన ప్రతిభను ప్రదర్శించేందుకు హైదరాబాద్ యువ ఆటగాడు హనుమ విహారికి ఈ టోర్నీ మరో అవకాశం కల్పిస్తోంది. దూకుడైన ఆటతీరుకు మారుపేరైన ఓపెనర్ శిఖర్ ధావన్‌పై జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. భద్రతలేమి కారణంగా సొంత గడ్డపై క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన సన్‌రైజర్స్ దూకుడైన ఆట ప్రదర్శిస్తే సీఎల్‌టి20లో కూడా సత్తా చాటే అవకాశం ఉంది. ధావన్‌కు నాయకత్వ పగ్గాలు విధ్వంసకర బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు మరో ప్రమోషన్ లభించింది. చాంపియన్స్ లీగ్ టి20లో పాల్గొనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రైజర్స్ కెప్టెన్ కుమార సంగక్కర సీఎల్‌టి20లో తన లంక జట్టు కంద్ మారూన్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జట్టు మేనేజ్మెంట్ ధావన్‌ను ఎంపిక చేసింది. సంగక్కర స్థానంలో ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పని చేసిన వైట్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ టీమ్‌లో ఉన్నాడు. అయితే అతడిని కాదని ధావన్‌ను ఎంపిక చేయ డం విశేషం. అన్ని ఫార్మాట్లలో అద్భుత ఫామ్ తో భారత జట్టులో స్థానం ఖాయం చేసుకున్న శిఖర్, ఐపీఎల్-6లో 10 మ్యాచుల్లో 311 పరుగులు చేసి సన్‌రైజర్స్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), వైట్, ఆశిష్ రెడ్డి, డుమిని, పార్థివ్ పటేల్ (కీపర్), సమంత్రే, ఇషాంత్, స్టెయిన్, ఆనంద్ రాజన్, అమిత్ మిశ్రా, పెరీరా, స్యామీ, కరణ్, విహారి.