చెన్నై ఆశలు సజీవం
బెంగళూరు: కెప్టెన్ ధోని (16 బంతుల్లో 35; 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు)ల అద్వితీయ పోరాటంతో చాంపియన్స్ లీగ్ టి20లో చెన్నై సూపర్ కింగ్స్ తమ సెమీస్ ఆశలను నిలుపుకుంది. ఓడితే కచ్చితంగా ఇంటిదారి పట్టే మ్యాచ్‌లో... ఈ జోడి ఆటతీరుతో నెగ్గి సెమీస్ రేసులో నిలిచింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్‌పై 13 పరుగుల తేడాతో చెన్నై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే మెకల్లమ్ (10 బంతుల్లో 11; 1 ఫోర్; 1సిక్స్), రైనా (1) అవుట్ కాగా 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధోని, జడేజా రాకతో స్కోరులో కదలిక వచ్చింది. 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదిన ధోని 27 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను జడేజా 6, 4గా మలిచాడు. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై 66 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. కౌల్టర్ నైల్ (21 బంతుల్లో 30; 2 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) యాసిర్ అరాఫత్ 11; మెకల్లమ్ (బి) పారిస్ 11; రైనా (రనౌట్) 1; మన్హాస్ (సి) పారిస్ (బి) హాగ్ 18; బ్రేవో (బి) టర్నర్ 27; జడేజా నాటౌట్ 44; ధోని (సి) టర్నర్ (బి) కౌల్టర్ నైల్ 35; హేస్టింగ్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1-15; 2-16; 3-33; 4-56; 5-79; 6-143.
బౌలింగ్: పారిస్ 2-0-13-1; కౌల్టర్ నైల్ 4-0-28-1; బీర్ 4-0-16-0; యాసిర్ 4-0-51-1; హాగ్ 4-0-25-1; టర్నర్ 2-0-19-1.
పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) ధోని (బి) నెహ్రా 13; వోజెస్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 27; ఎగర్ (బి) అశ్విన్ 4; మార్ష్ (సి) జడేజా (బి) అశ్విన్ 19; వైట్‌మాన్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 5; టర్నర్ (రనౌట్) 22; కౌల్టర్ నైల్ (సి) బ్రేవో (బి) మోహిత్ 30; అరాఫత్ నాటౌట్ 12; పారిస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-18; 2-26; 3-53; 4-68; 5-73; 6-123; 7-131.
బౌలింగ్: నెహ్రా 4-0-27-2; అశ్విన్ 4-0-20-3; మోహిత్ 3-0-17-1; జడేజా 4-0-26-0; హేస్టింగ్స్ 2-0-16-0; బ్రేవో 3-0-34-0.