బెంగళూరు: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని బార్బడోస్ ట్రైడెంట్స్ విజయంతో ముగించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈ జట్టు గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌ను ఓడించింది. వర్షం కారణంగా బార్బడోస్ విజయలక్ష్యాన్ని (డక్‌వర్త్ లూయీస్ ప్రకారం) 19 ఓవర్లలో 138 పరుగులుగా నిర్ణయించారు. ఫ్రాంక్లిన్ (25 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), కార్టర్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
టాస్ ఓడిన నార్తర్న్ డిస్ట్రిక్ట్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఫ్లైన్ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో నార్తర్న్ 11.2 ఓవర్లలో జట్టు 2 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌కు దాదాపు గంట సేపు అంతరాయం కలిగింది. దాంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. అనంతరం ఇన్నింగ్స్ కొనసాగించిన డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. డేవ్‌సిక్ (47 బంతుల్లో 47; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, వాట్లింగ్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (10 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ట్రైడెంట్స్ బౌలర్లలో రవి రాంపాల్ 3 వికెట్లు పడగొట్టాడు.
ట్రైడెంట్స్‌కు ఊరట విజయం
Published Wed, Oct 1 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement