Northern Districts
-
ట్రైడెంట్స్కు ఊరట విజయం
బెంగళూరు: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని బార్బడోస్ ట్రైడెంట్స్ విజయంతో ముగించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈ జట్టు గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌ను ఓడించింది. వర్షం కారణంగా బార్బడోస్ విజయలక్ష్యాన్ని (డక్‌వర్త్ లూయీస్ ప్రకారం) 19 ఓవర్లలో 138 పరుగులుగా నిర్ణయించారు. ఫ్రాంక్లిన్ (25 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), కార్టర్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టాస్ ఓడిన నార్తర్న్ డిస్ట్రిక్ట్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఫ్లైన్ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో నార్తర్న్ 11.2 ఓవర్లలో జట్టు 2 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌కు దాదాపు గంట సేపు అంతరాయం కలిగింది. దాంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. అనంతరం ఇన్నింగ్స్ కొనసాగించిన డిస్ట్రిక్ట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. డేవ్‌సిక్ (47 బంతుల్లో 47; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, వాట్లింగ్ (19 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (10 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ట్రైడెంట్స్ బౌలర్లలో రవి రాంపాల్ 3 వికెట్లు పడగొట్టాడు. -
పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
-
పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
మొహాలీ: చాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇక్కడ నార్తరన్ డిస్ట్రిక్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 120 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ 216 పరుగుల లక్ష్యాన్ని నార్తరన్ డిస్ట్రిక్స్ కు నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నార్తరన్ డిస్ర్టిక్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు విలియమ్ సన్(20),హారిస్(9)పరుగులు చేసి పెవిలియన్ కు చేరడంతో ఆ జట్టుకు కష్టాలు ఆరంభమయ్యాయి. అనంతరం డేవ్ రిచ్(28) పరుగులు చేసి నిష్క్రమించడంతో నార్తరన్ పతనం మొదలైంది. తరువాత ఓ ఒక్క ఆటగాడు పోరాట పటిమ ప్రదర్శించకపోవడంతో కేవలం 95 పరుగులకే పరిమితమైన నార్తరన్ డిస్ట్రిక్స్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నార్తరన్ జట్టులో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. పంజాబ్ బౌలర్ల కరణ్ వీర్ సింగ్ నాలుగు వికెట్లు లభించగా, పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి. వరుసుగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ ఘనంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. -
హరికేన్‌లా ఆడి...
రాయ్‌పూర్: బ్యాటింగ్‌లో ఏడెన్ బ్లిజార్డ్ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు)... బౌలింగ్‌లో హిల్ఫెన్హాస్ (3/14), బొలింజర్ (3/22) మెరిపించడంతో హోబర్ట్ హరికేన్స్ జట్టు దుమ్ము రేపింది. ఫలితంగా మంగళవారం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లో ఆ జట్టు 86 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ పైన్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు; 1 సిక్స్)తో పాటు షోయబ్ మాలిక్ (22 బంతుల్లో45 నాటౌట్; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) చెలరేగారు. ఆరో ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన బ్లిజార్డ్ నార్తర్న్ బౌలర్లను ఊచకోత కోశాడు. 19వ ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. మాలిక్‌తో కలిసి రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 16.4 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. స్కాట్ స్టైరిస్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే హరికేన్స్ బౌలర్లను ఎదుర్కోగలిగాడు. జట్టు బ్యాట్స్‌మెన్‌లో తొమ్మిది మంది కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. చివర్లో సౌతీ (12 బంతుల్లో 21; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఓ మేరకు ఆడినా... నాలుగు బంతుల్లో బొలింజర్ మూడు వికెట్లు తీసి ముగింపు పలికాడు. హిల్ఫెన్హాస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది. స్కోరు వివరాలు హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) సౌతీ (బి) కుగ్గెలిన్ 12; పైన్ (సి) బౌల్ట్ (బి) సోధి 43; బ్లిజార్డ్ (సి) స్టైరిస్ (బి) సౌతీ 62; షోయబ్ నాటౌట్ 45; బిర్ట్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-21; 2-68; 3-168. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4-0-46-0; సౌతీ 4-0-29-1; స్టైరిస్ 4-0-28-0; కుగ్గెలిన్ 2-0-22-1; సోధి 4-0-31-1; జోనో బౌల్ట్ 2-0-16-0. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డెవిసిచ్ (సి) లాగ్లిన్ (బి) మెన్నీ 2; విలియమ్సన్ (సి) డోహర్తి (బి) హిల్ఫెన్హాస్ 3; ఫ్లిన్ (బి) హిల్ఫెన్హాస్ 0; వాట్లింగ్ ఎల్బీడబ్ల్యు (బి) హిల్ఫెన్హాస్ 9; మిచెల్ (స్టంప్డ్) పైన్ (బి) డోహర్తి 9; స్టైరిస్ (సి) వెల్స్ (బి) మెన్నీ 37; కుగ్గెలిన్ (బి) డోహర్తి 2; సౌతీ (సి) హిల్ఫెన్హాస్ (బి) బొలింజర్ 21; జొనో బౌల్ట్ (సి) వెల్స్ (బి) బొలింజర్ 1; సోధి (సి) బిర్ట్ (బి) బొలింజర్ 0; ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1-3; 2-5; 3-5; 4-19; 5-59; 6-63; 7-87; 8-92; 9-92; 10-92. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-14-3; మెన్నీ 3-1-10-2; డోహర్తి 4-1-17-2; బొలింజర్ 2.4-0-22-3; లాగ్లిన్ 3-0-25-0. -
‘నార్తర్న్ మరో విజయం
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో ప్రధాన పోటీలకు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేరువైంది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 72 పరుగులతో లాహోర్ లయన్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ముంబైపై ఘన విజయం సాధించిన పాక్ టీమ్ రెండో మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. నార్తర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేయగా... లాహోర్ లయన్స్ 18 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సౌతీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారీ భాగస్వామ్యం... టాస్ ఓడిన డిస్ట్రిక్ట్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు డేవ్‌సిక్ (9), విలియమ్స్ (14) విఫలం కాగా, హారిస్ (13 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. నార్తర్న్ స్కోరు 36/3 వద్ద ఉన్న దశలో జత కలిసిన ఫ్లిన్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్లింగ్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 9.3 ఓవర్లలోనే 90 పరుగులు జోడించడం విశేషం. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పాక్ బౌలర్లంతా విఫలమయ్యారు. చీమాకు 3 వికెట్లు దక్కాయి. నసీమ్ ఒంటరి పోరాటం... లక్ష్యఛేదనలో లయన్స్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం నిలబడలేకపోయారు. తొలి ఓవర్ మినహా తర్వాతి ఐదు ఓవర్లలో ఆ జట్టు వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడంతో జట్టు స్కోరు 19/5 వద్ద నిలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ (3/22)తో పాటు బౌల్ట్ (2/12), సోధి (2/30) లయన్స్‌ను దెబ్బ తీశారు. సహచరులంతా వెనుదిరిగినా... సాద్ నసీమ్ (40 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. అతను మినహా ఇతర ఆటగాళ్లంతా ఒక అంకె స్కోరుకే పరిమితం కావడం విశేషం. ఆఖరి వికెట్‌గా రనౌట్ రూపంలో సాద్ అవుట్ కావడంతో లాహోర్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డేవ్‌సిక్ (సి) రియాజ్ (బి) రజా 9; విలియమ్సన్ (సి) అక్మల్ (బి) చీమా 14; హారిస్ (సి) అండ్ (బి) హఫీజ్ 20; ఫ్లిన్ (స్టంప్డ్) అక్మల్ (బి) రసూల్ 53; వాట్లింగ్ (సి) షెహజాద్ (బి) చీమా 53; స్టైరిస్ (సి) షెహజాద్ (బి) చీమా 14; మిచెల్ (నాటౌట్) 1; కుగ్లెన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170 వికెట్ల పతనం: 1-15; 2-36; 3-60; 4-150; 5-167; 6-167. బౌలింగ్: రజా 3-0-14-1; హఫీజ్ 4-0-35-1; చీమా 4-0-35-3; రసూల్ 3-0-29-1; రియాజ్ 4-0-33-0; అలీ 2-0-22-0. లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషెద్ (బి) సౌతీ 5; షెహజాద్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 2; హఫీజ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 5; సిద్దిఖ్ (ఎల్బీ) (బి) సౌతీ 3; అక్మల్ (బి) బౌల్ట్ 1; నసీమ్ రనౌట్ 58; రజా (సి) మిచెల్ (బి) స్టైరిస్ 5; రియాజ్ (ఎల్బీ) (బి) సోధి 2; అలీ (సి) విలియమ్సన్ (బి) సోధి 8; రసూల్ (రనౌట్) 4; చీమా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 98 వికెట్ల పతనం: 1-5; 2-12; 3-16; 4-17; 5-19; 6-34; 7-37; 8-67; 9-80; 10-98. బౌలింగ్: బౌల్ట్ 4-0-12-2; సౌతీ 4-0-22-3; కుగ్లెన్ 3-1-13-0; స్టైరిస్ 3-0-20-1; సోధి 4-0-30-2.