హరికేన్‌లా ఆడి...
రాయ్‌పూర్: బ్యాటింగ్‌లో ఏడెన్ బ్లిజార్డ్ (43 బంతుల్లో 62; 8 ఫోర్లు)... బౌలింగ్‌లో హిల్ఫెన్హాస్ (3/14), బొలింజర్ (3/22) మెరిపించడంతో హోబర్ట్ హరికేన్స్ జట్టు దుమ్ము రేపింది. ఫలితంగా మంగళవారం నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లో ఆ జట్టు 86 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ పైన్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు; 1 సిక్స్)తో పాటు షోయబ్ మాలిక్ (22 బంతుల్లో45 నాటౌట్; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) చెలరేగారు. ఆరో ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన బ్లిజార్డ్ నార్తర్న్ బౌలర్లను ఊచకోత కోశాడు. 19వ ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. మాలిక్‌తో కలిసి రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు.
ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 16.4 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. స్కాట్ స్టైరిస్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే హరికేన్స్ బౌలర్లను ఎదుర్కోగలిగాడు. జట్టు బ్యాట్స్‌మెన్‌లో తొమ్మిది మంది కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. చివర్లో సౌతీ (12 బంతుల్లో 21; 1 ఫోర్; 2 సిక్సర్లు) ఓ మేరకు ఆడినా... నాలుగు బంతుల్లో బొలింజర్ మూడు వికెట్లు తీసి ముగింపు పలికాడు. హిల్ఫెన్హాస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
స్కోరు వివరాలు
హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) సౌతీ (బి) కుగ్గెలిన్ 12; పైన్ (సి) బౌల్ట్ (బి) సోధి 43; బ్లిజార్డ్ (సి) స్టైరిస్ (బి) సౌతీ 62; షోయబ్ నాటౌట్ 45; బిర్ట్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో మూడు వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1-21; 2-68; 3-168.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4-0-46-0; సౌతీ 4-0-29-1; స్టైరిస్ 4-0-28-0; కుగ్గెలిన్ 2-0-22-1; సోధి 4-0-31-1; జోనో బౌల్ట్ 2-0-16-0.
నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డెవిసిచ్ (సి) లాగ్లిన్ (బి) మెన్నీ 2; విలియమ్సన్ (సి) డోహర్తి (బి) హిల్ఫెన్హాస్ 3; ఫ్లిన్ (బి) హిల్ఫెన్హాస్ 0; వాట్లింగ్ ఎల్బీడబ్ల్యు (బి) హిల్ఫెన్హాస్ 9; మిచెల్ (స్టంప్డ్) పైన్ (బి) డోహర్తి 9; స్టైరిస్ (సి) వెల్స్ (బి) మెన్నీ 37; కుగ్గెలిన్ (బి) డోహర్తి 2; సౌతీ (సి) హిల్ఫెన్హాస్ (బి) బొలింజర్ 21; జొనో బౌల్ట్ (సి) వెల్స్ (బి) బొలింజర్ 1; సోధి (సి) బిర్ట్ (బి) బొలింజర్ 0; ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16.4 ఓవర్లలో ఆలౌట్) 92.
వికెట్ల పతనం: 1-3; 2-5; 3-5; 4-19; 5-59; 6-63; 7-87; 8-92; 9-92; 10-92.
బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-14-3; మెన్నీ 3-1-10-2; డోహర్తి 4-1-17-2; బొలింజర్ 2.4-0-22-3; లాగ్లిన్ 3-0-25-0.