లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్ | Gujarat lions won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్

Published Sat, Apr 29 2017 7:53 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

Gujarat lions won the toss and elected to bat first

రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం రాత్రి ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఇది గుజరాత్ కు కీలకం కావడంతో ఆ జట్టు పూర్తిస్థాయి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. మరొకవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ మరొక గెలుపును సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో టాప్ చేరాలని భావిస్తోంది.


గుజరాత్ తుది జట్టు: సురేశ్ రైనా(కెప్టెన్), ఇషాన్ కిషన్, బ్రెండన్ మెకల్లమ్, అరోన్ ఫించ్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, ఫల్కనర్, ఇర్ఫాన్ పఠాన్, ఆండ్రూ టై, బాసిల్ తంపి, అంకిత్ సోని

ముంబై తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), జాస్ బట్లర్, పార్థీవ్ పటేల్, నితీష్ రానా, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, హర్భజన్ సింగ్, కృణాల్ పాండ్యా, మెక్లీన్ గన్, లసిత్ మలింగా, బూమ్రా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement