
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ నాటికి తాను జట్టు మారతానన్న వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. తాను జట్టు మారే యోచనలో లేనని, ఒకవేళ మారే పక్షంలో ముందుగానే చెబుతానని స్పష్టం చేశాడు. తాను జట్టు మారడానికి యత్నిస్తున్నట్లు రూమర్లలో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ 10 సీజన్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన హర్భజన్ గత సీజన్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే.. ఐపీఎల్ 11 ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ -12లో హర్భజన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడతాడని, కుదరని పక్షంలో ఆ టీమ్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అలాంటి వదంతులు నమ్మవద్దని భజ్జీ కోరాడు. 'చెన్నై జట్టులో నాకు ఏ ఇబ్బంది లేదు. గొప్ప ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తా. ఒకవేళ వేరే జట్టుకు మారాలనుకుంటే నేనే చెబుతా. తన విషయాలకు సంబంధించి నన్ను మించిన న్యూస్ సోర్స్ లేదు’ అని భజ్జీ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment