'హర్భజన్ ను ఎంపిక చేయాల్సింది'
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నర్ అయిన హర్భజన్ ను 15 మందితో కూడిన భారత జట్టులో తీసుకుంటే జట్టు మరింత బలంగా ఉండేదన్నాడు.
'హర్భజన్ ఒక గేమ్ ఛేంజరే కాదు.. మ్యాచ్ విన్నర్ కూడా. హర్భజన్ కు భారత క్రికెట్ జట్టు సెలక్టర్లు చోటు కల్సించి ఉండాల్సింది. గతంలో ఎన్నో సందర్భాల్లో హర్భజన్ మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇంకా మ్యాచ్లను గెలిపించే సత్తా అతనిలో ఉంది. టీమిండియాలో అతను లేకపోవడం నిజంగా అవమానకరమే'అని సక్లయిన్ అభిప్రాయపడ్డాడు.