
డబ్లిన్: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. ధోని పరిచయం చేసిన హెలికాప్టర్ షాట్‌ను అచ్చం అతనిలానే ఆడుతూ సిక్స్ బాదాడు. ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ధోని హెలికాప్టర్ సిక్సర్లు బాదలేకపోయాడు. కానీ.. ఆ కొరతను హిట్టర్ హార్దిక్ పాండ్యా ఆఖరి బంతిని హెలికాప్టర్ షాట్‌తో సిక్సర్‌గా కొట్టి తీర్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్ (74) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీనిలో భాగంగా ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని (11: 5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (0) కూడా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (6 నాటౌట్)కి ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఐర్లాండ్ బౌలర్ ఛేజ్ ఆఫ్ స్టంప్‌కి సమీపంలో బంతిని విసరగా హర్దిక్ హెలికాప్టర్ షాట్ బాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment