హరికృష్ణకు తొలి గెలుపు | Hari Krishna the first win | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు తొలి గెలుపు

Published Sat, Mar 25 2017 1:50 AM | Last Updated on Wed, Aug 29 2018 1:16 PM

హరికృష్ణకు తొలి గెలుపు - Sakshi

హరికృష్ణకు తొలి గెలుపు

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. మైకేల్‌ ఆడమ్స్‌ (ఇంగ్లండ్‌)తో శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ 51 ఎత్తుల్లో గెలుపొందాడు. రెండో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)–లిరెన్‌ డింగ్‌ (చైనా)ల మధ్య జరిగిన గేమ్‌ 37 ఎత్తుల్లో; పీటర్‌ స్విద్లెర్‌ (రష్యా)–యు యాంగి (చైనా)ల మధ్య జరిగిన గేమ్‌ 24 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement