
భారత్‌ను గెలిపించిన హర్మన్‌ప్రీత్
ఇపో (మలేసియా): తొలి మ్యాచ్‌లో విజయావకాశాలను వదులుకుని ‘డ్రా’తో సరిపెట్టుకున్నా... ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చెలరేగింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 3–0తో ఘనవిజయం సాధించింది. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచి భారత్ విజయంలో కీలకపాత్ర వహించాడు. అంతకుముందు 23వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అయితే తొలి క్వార్టర్‌లో కివీస్ చేసిన మూడు గోల్ ప్రయత్నాలను కీపర్ శ్రీజేష్ వమ్ము చేశాడు.
ఇక 27వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 2–0కి పెరిగింది. అలాగే 47వ నిమిషంలోనూ హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చి భారత్ ఖాతాలో మూడో గోల్ చేర్చి విజయం ఖాయం చేశాడు. రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.
ఎస్వీ సునీల్ ః 200
భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మలేసియాలో జరుగుతున్న అజ్లాన్‌షా హాకీ టోర్నీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా 200 అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని పూర్తి చేసుకున్నాడు. 2007 ఆసియా కప్ సందర్భంగా అరంగేట్రం చేసిన సునీల్..పదేళ్ల వ్యవధిలో ఈ ఘనతను పూర్తి చేశాడు. 2016 ఉత్తమ ఆసియా ప్లేయర్‌గా నిలిచాడు. ఈక్రమంలో 2014 ఆసియా గేమ్స్‌లో భారత్ చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడైన సునీల్.. 2015 వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నీలో జట్టు కాంస్యం సాధించడంలో పాత్ర పోషించాడు. మరోవైపు 2012, 2016 ఒలింపిక్స్‌ల్లో జట్టు తరఫున పాల్గొన్నాడు.