
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు కూడా భారత రెజ్లర్లు పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు) రజతం నెగ్గగా... జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో హర్‌ప్రీత్ 0–8తో అబ్దావలి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో జ్ఞానేందర్ 9–0తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్‌కిది వరుసగా నాలుగో పతకం కావడం విశేషం. అతను 2016, 2017, 2018లలో కాంస్య పతకాలు నెగ్గగా... ఈసారి రజతం దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment