harpreet singh
-
కాన్సులేట్ సేవలు నిలిపేసిన కెనడా
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌ప్రీత్‌సింగ్ నిజ్జర్ హత్య విషయమై భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా 41 మంది దౌత్యవేత్తలను దేశం వీడాల్సిందిగా కేంద్రం ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయాలని కెనడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం ప్రకటించారు. 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలవాల్సి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడ్డ కారణంగా ఈ చర్యకు దిగాల్సి వచి్చందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మాత్రమే భారత్‌లో ఉన్నట్టు వివరించారు. భారత్‌లో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా కొనసాగుతున్న 10 వీసా దరఖాస్తు కేంద్రాలపై తమ నిర్ణయం ప్రభావం పడబోదని తెలిపారు. ఇంతేకాకుండా, చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేయడమే గాక, ఆ నగరాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కెనడా తాజాగా తమ పౌరులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది. -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్‌ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్‌ప్రీత్‌ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన హర్‌ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్‌కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్‌ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
మళ్లీ మెరిసిన హర్‌ప్రీత్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు కూడా భారత రెజ్లర్లు పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ (82 కేజీలు) రజతం నెగ్గగా... జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో హర్‌ప్రీత్ 0–8తో అబ్దావలి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో జ్ఞానేందర్ 9–0తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్‌కిది వరుసగా నాలుగో పతకం కావడం విశేషం. అతను 2016, 2017, 2018లలో కాంస్య పతకాలు నెగ్గగా... ఈసారి రజతం దక్కించుకున్నాడు. -
మన రెజ్లర్లు విఫలం
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ల పోరాటం ముగిసింది. రెండో రోజు బరిలోకి దిగిన జ్ఞానేందర్ (59 కేజీలు), రవీందర్ (66 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. జ్ఞానేందర్ తొలి రౌండ్లో 4–1తో లిబిన్ డింగ్ (చైనా)పై గెలిచి, ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–9తో మిరామ్బెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుడు ట్వీట్ వల్ల ఐపీఎల్లో బంగారు భవిష్యత్తు కాస్తా నాశనం అయిపోయింది. కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ హర్‌ప్రీత్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేసిన హర్‌ప్రీత్.. మధ్యప్రదేశ్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంధేరి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు కారుతో దూసుకెళ్లిన వ్యక్తి అతడేనని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఒక తప్పుడు ట్వీట్ రావడంతో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా హర్‌ప్రీత్‌ను తీసుకోలేదు. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్లకు ఆడిన హర్‌ప్రీత్ నిజానికి ఏ కేసులోనూ అరెస్టు కాలేదు. ముంబైలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లింది అతడు కాదు, హర్మీత్ సింగ్ అనే మరో యువ క్రికెటర్. అతడు ఇండియా అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. పేరు దగ్గరగా ఉండటంతో హర్ప్రీతే ఈ నేరం చేశాడంటూ ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరింది. నిజానికి తాము హర్‌ప్రీత్‌ను కొందామనుకున్నామని, కానీ అతడి అరెస్టు వార్తలు విని ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ఊరుకున్నామని.. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు నేరస్తుడు హర్‌ప్రీత్ కాదు, హర్మీత్ అన్న విషయం తెలిసిందని ఒక ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇప్పుడు తన పేరుతో పాటు తన కెరీర్ కూడా పాడైపోయిందని, ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలని హర్‌ప్రీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను ఐపీఎల్ గురించి బాధ పడట్లేదని, చివరకు గూగుల్‌లో తన పేరు సెర్చ్ చేసినా తాను అరెస్టయినట్లే వస్తోందని అన్నాడు. -
హైదరాబాద్‌లో గూగుల్ సొంత క్యాంపస్
హైదరాబాద్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సొంత, అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇది కార్యరూపం దాలిస్తే యూఎస్, యూకే తర్వాత సంస్థకు మూడవ క్యాంపస్ అవుతుందని తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం గూగుల్ హైదరాబాద్ క్యాంపస్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తోంది. సొంత భవనంలోకి మారాలని చూస్తోందని ఆయన చెప్పారు. ఇక హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దే హైఫై ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు ఎయిర్టెల్, సిస్కో, వొడాఫోన్‌తోపాటు తైవాన్‌కు చెందిన ఒక కంపెనీ ఆసక్తి కనబరిచాయని పేర్కొన్నారు. ఈ కంపెనీలు పూర్తిస్థాయి హైదరాబాద్ పటంతోపాటు కొన్ని వివరణలు కోరాయని, తాము ఈ పనిలో నిమగ్నమయ్యామని అన్నారు. మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయని, మూడు నాలుగు నెలల్లో కాంట్రాక్టులు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్: టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం రూ.30 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదిత ఇంక్యుబేషన్ కేంద్రం డిజైన్ పూర్తి అయిందని హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. 800 సీట్ల సామర్థ్యం గల ప్రతిపాదిత సెంటర్లో 500 స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలు సాగించొచ్చు. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఈ సెంటర్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
షూటింగ్లో పతకాల వేట మళ్లీ మొదలైంది
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ హర్‌ప్రీత్ సింగ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. మరో విభాగంలో భారత షూటర్ గగన్ నారంగ్ పతకం రేసులో ఫైనల్స్‌కు చేరాడు.