‘బ్లిట్జ్’లో రజతం నెగ్గిన హర్ష
బాలచంద్ర, సుప్రీతలకు కాంస్యాలు ఆసియా యూత్ చెస్
న్యూఢిల్లీ: ర్యాపిడ్, స్టాండర్డ్ విభాగాల్లో రాణించిన హైదరాబాద్ చెస్ క్రీడాకారులు అదే జోరును బ్లిట్జ్ విభాగంలోనూ కొనసాగించారు. గురువారం ముగిసిన ఆసియా యూత్ చెస్ బ్లిట్జ్ ఈవెంట్‌లో మూడు పతకాలు సాధించారు. అండర్-14 ఓపెన్ విభాగంలో హర్ష భరతకోటి రజతం... అండర్-18 బాలికల విభాగంలో విజయవాడ అమ్మాయి పొట్లూరి సుప్రీత కాంస్యం... అండర్-18 ఓపెన్ విభాగంలో ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ కాంస్యం గెలిచారు. బుధవారం ముగిసిన స్టాండర్డ్ విభాగంలో అండర్-18 కేటగిరిలో హైదరాబాద్ కుర్రాడు ఎం.చక్రవర్తి రెడ్డి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.