ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి | Hockey legend Dhyan Chand remembered on his birthday | Sakshi
Sakshi News home page

ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి

Aug 30 2018 10:36 AM | Updated on Aug 30 2018 10:36 AM

Hockey legend Dhyan Chand remembered on his birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత హాకీ క్రీడకు ధ్యాన్‌చంద్‌ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ‘సాయ్‌’ రీజనల్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సుందర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీఎం సత్యరాజ్, ‘శాట్స్‌’ డిప్యూటీ డైరెక్టర్‌ జి.ఎ.శోభ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విమలాకర్‌ రావు పలువురు కోచ్‌లు, క్రీడాకారులు, గచ్చిబౌలి స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం ఎగ్జిబిషన్‌ హకీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్‌బాబు మాట్లాడుతూ యువ క్రీడాకారులు లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో సత్తా చాటాలని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement