Dhyan Chand
-
రసవత్తరం..రెట్టించిన ఉత్సాహం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు రాష్ట్రవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. యువకులు రెట్టించిన ఉత్సాహంలో పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రానికి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు ఉత్సాహంగా ఉంది. యువత బ్యాటు, బంతి పట్టుకుని మైదానాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం క్రీడల పట్ట ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో క్రీడా రంగం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వారంతా మ్యాచ్‌లు తిలకించేందుకు మైదానాలకు క్యూ కడుతున్నారు. ఐదో రోజు శనివారం 6,386 గ్రామ వార్డు సచివాలయాల్లో షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహించాల్సి ఉండగా 6373 సచివాలయాల్లో పోటీలు జరిగాయి. 3,23,781 మంది ప్రేక్షకులు ఆటల పోటీలను తిలకించారు. మొత్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాలకుగానూ 14,690 చోట్ల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతపురం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ’ఆడుదాం ఆంధ్ర’ కు సెలవు అయినప్పటికీ కొన్నిచోట్ల రీ షెడ్యూల్ మ్యాచ్‌లు పూర్తి చేయనున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. తిరుపతి జిల్లాలో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. కబడ్డి, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పెనుమూరు మండలాల్లో బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి. నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రీడలను మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 283 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో క్రీడాపోటీలు జరిగాయి. జిల్లాలో 791 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10,151 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనగా, 33,639 మంది ప్రేక్షకులు పోటీలను వీక్షించారు. 719 మంది ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో పోటీలు చురుగ్గా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా రాజా కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడలను శాప్ ఎండి ధ్యాన్‌చంద్ పరిశీలించారు. కడపలో మైదానాల వైపు క్యూ.. మెగా క్రీడా టోర్నమెంట్లో భాగంగా కడపలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో క్రీడాంశాల్లో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ పోటీల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో నిర్వహించిన పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ ఎస్.జిలానీబాషా ప్రారంభించారు. వివిధ మండలాల్లో పోటీలను ఎంపీడీఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 535 సచివాలయాల పరిధిలో శనివారం 864 మ్యాచ్‌లు నిర్వహించగా 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను తిలకించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు క్రీడలను తిలకించినట్టు జిల్లా చీఫ్ కోచ్ డి.దుర్గారావు చెప్పారు. -
హాకీ స్టిక్ మాంత్రికుడు: ద్యాన్ చంద్ /1905-1979
1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో జెస్సీ ఒవెన్ సాధించిన ఘనత గురించి ఇప్పటికీ ప్రశంసల వర్ష కురిపిస్తాం. అప్పటి నాజీ ధోరణులపై ఆయన పైచేయి సాధించినట్లు భావిస్తాం. మరి ధ్యాన్ చంద్ గురించి ఏం చెప్పుకోవాలి? ఆయన అంతకు మునుపటి రెండు ఒలింపిక్స్‌లో 20 గోల్స్ సాధించడమే కాక, బెర్లిన్‌లో సైతం తన సత్తా చాటారు. ఫైనల్లో జర్మనీ జట్టుపై మూడు గోల్స్ చేశారు. ధ్యాన్‌చంద్ ప్రపంచంపై చూపిన ప్రభావంపై సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది. ‘‘కేవలం చదవడం, రాయడమే’’ వచ్చిన ఈ సాధారణ భారతీయుడు ప్రపంచ హాకీ భవిష్యత్తునే తిరగరాశారు. హాకీ జట్టు మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పుడు బెర్లిన్ ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టు కెప్టెన్‌గా ధ్యాన్ చంద్ నియమితులయ్యారు. నిజం చెప్పాలంటే, తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటి కన్నా ఇలా కెప్టెన్‌గా నియమితం కావడమే ధ్యాన్ చంద్ జీవితంలోని అత్యున్నత సంఘటన. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పుస్తక రచయితల మాటల్లో చెప్పాలంటే.. ‘ప్రపంచంలోని అతి పెద్ద విడాకులు’ అయిన భారతదేశ విభజన సందర్భంగా చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ను సైతం లెక్కపెట్టి, భారత పాకిస్థాన్‌ల మధ్య పంచుకున్నారు. అయితే బ్రిటిష్ భారతావని లేదా అవిభక్త భారతదేశంగా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మూడు స్వర్ణాలూ తటస్థమైనవేనని ప్రకటించారు. 1936 నాటి బెర్లిన్ ఒలింపిక్స్‌నే తీసుకుంటే భారతహాకీ జట్టులోని 18 మందిలో పాకిస్థాన్ నుంచి ఇద్దరు హిందువులు, నలుగురు ముస్లిములు, ఎనిమిది మంది ఆంగ్లో ఇండియన్లు ఉన్నాయి. అయితే «ధ్యాన్ చంద్ ఆట నైపుణ్యంతో పోలిస్తే ఆ 14 మందీ తక్కువే కావడంతో, స్వతంత్ర భారతావనే ఆ మానసిక యుద్ధంలో విజయం సాధించింది. ఆత్మకథ అయిన ‘గోల్’లోమాత్రం ధ్యాన్‌చంద్, ‘‘ఆత్మకథ రాసేంతగా నేను మరీ ముఖ్యమైన వ్యక్తినేమీ కాదు’’ అని సవినయతను కనబరిచారు. అలాంటి గొప్ప వ్యక్తి భారత జాతి ప్రతిపత్తిని నిరంతం ప్రకాశవంతం చేస్తూనే ఉంటారు. – కె.ఆర్ముగం, భారత హాకీ అంశాలపై నిపుణులు (చదవండి: మొనగాళ్లకు మొనగాడు ) -
ధ్యాన్‌చంద్ జయంతి.. ఆసక్తికర విషయాలు
-
గోదారి ఒడిలో ఎగసిన క్రీడాతరంగం..
సాక్షి,తూర్పు గోదావరి: అమ్మ ఒడి ఆలోచనకు అంకురమైతే ఆటపాటలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాలకు దారి చూపుతాయి. పిల్లల మస్తిష్క వికాసంలో చదువుతో పాటు క్రీడలూ ఎంతో దోహదపడతాయి. చదువే ప్రాణంగా పరిగణించేవారు కొందరైతే క్రీడల ద్వారా దేశ కీర్తిని పెంచాలనే వారు మరి కొందరుంటారు. క్రీడారంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ►అమలాపురానికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ జిల్లా నుంచి తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడాడు. ఇది జిల్లా క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయమేనని చెప్పాలి. ఈ ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా వారిలో మన సాత్విక్ ఒకరు. సహ క్రీడాకారుడు చిరాగ్‌శెట్టితో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన సాత్విక్‌కు ఈ నెల 7న అమలాపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానంటూ భవిష్యత్ ప్రణాళికను ముందుగానే ప్రకటించాడు. సాత్విక్‌ను ప్రోత్సహిస్తూ ఒలింపిక్స్‌కు ముందే జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ►కూనవరం మండలం పీరా రామచంద్రపురం వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజా రజిత 2019 అసోంలో జరిగిన జాతీయ పరుగు పోటీల్లో రజత పతకం సాంధించింది. త్వరలో కెన్యాలో నిర్వహించే అండర్–20 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో దేశం తరఫున ఆమె పాల్గోనుంది. ►నేపాల్‌లో 2021 ఫిబ్రవరిలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మామిడికుదురుకు చెందిన బోయి అర్జున్, అప్పనపల్లికి చెందిన బొంతు గీతికావేణి బంగారు పతకాలు సాధించారు. ►కాలికట్లో మార్చిలో జరిగిన 32వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో యానాం విద్యార్థిని సూదా తేజస్వి 1,500 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించింది. ►2020 డిసెంబర్లో పాయకరావుపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా జట్టు 34 బంగారు పతకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ►జనవరిలో గుంటూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల జిల్లా జట్టు ద్వితీయ స్థానం, మహిళల జిల్లా జట్టు ఆరో స్థానం దక్కించుకున్నాయి. ►పిఠాపురంలో ఫిబ్రవరి 2న రాష్ట్రస్థాయి రగ్బీ ఇన్స్ట్రక్టర్స్ రిఫ్రెషర్ కోర్స్ కం ప్రాక్టికల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ►ఫిబ్రవరి 3న అమలాపురంలో జిల్లా స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో 120 మంది సత్తా చూపారు. ►ఫిబ్రవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురోహితుల క్రికెట్ లీగ్ పోటీల్లో 12 జట్లుకు చెందిన 140 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ►మార్చి 3న రాజానగరం మండలం సంపత్‌నగరంలో 32వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ►పెద్దాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన బిరదా సాయి సింధూజ జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికైంది. ధ్యాన్‌చంద్ పుట్టిన రోజే.. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29న జాతీ య క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన సారథ్యంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి, భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించింది. చరిత ఘనం జిల్లాకు చెందిన డాక్టర్ సుంకర హనుమంతరావు 1948 ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సి ఉండగా ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లడంతో ఆగిపోయారు. 1952లో ఒలింపిక్స్‌లో ఆడాల్సి ఉన్న ఆయన సోదరుడు సుంకర వెంకట రమణారావు సాధనలో గాయం కారణంగా వెళ్లలేకపోయారు. ‘‘ఫాదర్ ఆఫ్ ఏపీ ఫుట్‌బాల్’’గా ఖ్యాతికెక్కిన సుంకర సుంకర భాస్కరరావు తన జీవితాన్ని క్రీడారంగానికే అంకితమిచ్చారు. రాజమహేంద్రవరంలో పుట్టి, పెరిగిన ఆయన 1975లో జిల్లా ఒలింపిక్ సంఘాన్ని స్థాపించారు. ఆయన అధ్యక్షుడుగా, అనపర్తికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు మల్లికార్జునరావు కార్యదర్శిగా క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి ఆరంభమైంది. పొట్టి శ్రీరాములు ఆలిండియా గోల్డ్‌కప్ టోర్నమెంట్లను సుంకర భాస్కరరావు నిర్వహించేవారు. 1978లో ఇండియా, స్వీడన్ మహిళా ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. క్రీడారంగానికి ఆయన అందించిన సేవలను గౌరవిస్తూ రాజమహేంద్రవరం గాంధీపురంలోని మున్సిపల్ పాఠశాలకు ‘సుంకర భాస్కరరావు’ పేరు పెట్టారు. జిల్లా ఒలింపిక్ సంఘానికి 1993లో వైడీ రామారావు, పిఠాపురానికి చెందిన ఎస్ఎస్వీ రత్నం అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2014 వరకూ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వైడీ రామారావు, పద్మనాభం పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2016 నుంచి చుండ్రు గోవిందరాజు, కె.పద్మనాభం అధ్యక్ష కార్యదర్శులుగా సేవలందిస్తున్నారు. -
ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత హాకీ క్రీడకు ధ్యాన్‌చంద్ చేసిన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ‘సాయ్’ రీజనల్ డైరెక్టర్ శ్యామ్ సుందర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీఎం సత్యరాజ్, ‘శాట్స్’ డిప్యూటీ డైరెక్టర్ జి.ఎ.శోభ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విమలాకర్ రావు పలువురు కోచ్‌లు, క్రీడాకారులు, గచ్చిబౌలి స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ హకీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్‌బాబు మాట్లాడుతూ యువ క్రీడాకారులు లెజెండ్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో సత్తా చాటాలని పేర్కొన్నారు. -
ప్రసాద్‌కు జీవన సాఫల్యం... హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్’
నామినేట్ చేసిన కేంద్ర క్రీడా అవార్డుల కమిటీ న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు కు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ నెల 29న జాతీ య క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు. పారా కోచ్‌కు కూడా... దశాబ్ద కాలం పాటు భారత అథ్లెటిక్స్ కోచ్‌గా పని చేసిన రామకృష్ణన్ గాంధీ (మరణానంతరం)కి ద్రోణాచార్య అవార్డు దక్కనుంది. నడకలో ఇటీవల విశేషంగా రాణించిన గుర్మీత్ సింగ్, బల్జీందర్ సింగ్, దీపమాలా దేవిలాంటి అథ్లెట్లు ఆయన శిక్షణలో ఆరితేరిన వారే. రామకృష్ణన్ ఏడాది క్రితం చనిపోయారు. పారా అథ్లెట్, రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తంగవేలు మరియప్పన్ కోచ్ సత్యనారాయణ (కర్ణాటక), కబడ్డీ కోచ్ హీరానంద్ కటారియా కూడా ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ధ్యాన్‌చంద్ అవార్డు భూపేందర్ సింగ్ (అథ్లెటిక్స్), సుమరై టెటె (హాకీ)లకు దక్కనుంది. జీవిత కాల సాఫల్య పురస్కారం సిఫారసు జాబితాలో బ్రిజ్‌భూషణ్ మొహంతి (బాక్సింగ్), పీఏ రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్) ఉన్నారు. బ్యాడ్మింటన్ వర్గాల్లో గంగూలీ ప్రసాద్‌గా చిరపరిచితుడైన జీఎస్ఎస్వీ ప్రసాద్ 1982 నుంచి ‘సాయ్’ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన శిక్షణలో అనేక మంది షట్లర్లు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టోర్నీ గెలిచిన సమయంలో అతనికి కోచ్‌గా ఉన్న ప్రసాద్... ఇప్పుడు గోపీచంద్ కమిటీ ద్వారానే అవార్డుకు అర్హత సాధించడం విశేషం. రెండేళ్ల పాటు ప్రసాద్, భారత హాకీ జట్టుకు ఫిజికల్ ట్రైనర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం యూఎస్ ఓపెన్ టోర్నీకి భారత జట్టుతో పాటు వెళ్లారు. భారత ఫుట్‌బాల్ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో హకీమ్ ఒకరు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఆయన భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రఖ్యాత కోచ్ ఎస్ఏ రహీమ్ కుమారుడైన హకీమ్... ఆటగాడిగా కెరీర్ ముగిసిన అనంతరం జాతీయ జట్టు కోచ్‌గా కూడా అనేక మందిని తీర్చిదిద్దారు. ‘ఫిఫా’ ఇంటర్నేషనల్ రిఫరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ డీన్, ‘సాయ్’ రీజినల్ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పని చేసిన 78 ఏళ్ల హకీమ్ భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అండర్–17 ప్రపంచ కప్ కోసం ‘సాయ్’ చీఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. -
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి
► భారత్న రత్న ప్రకటించాలని క్రీడా మంత్రిత్వ శాఖ పీఎంవో కు లేఖ న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్‌కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని మీడియాతో ఆ శాఖ మంత్రి విజయ్ గోయల్ ధృవికరించారు. హాకీలో దేశానికి ఎన్నో విజయాలందించిన ధ్యాన్ చంద్‌కు భారత రత్న ప్రకటించి నిజమైన నివాళిలు అర్పిస్తామని గోయల్ తెలిపారు. ధ్యాన్ చంద్ హాకీలో భారత్‌కు 1928,1932,1936 లో స్వర్ణపతకాలందించిన విషయం తెలిసిందే. క్రీడాకారులకు భారత అత్యున్నత పురస్కారం ఇవ్వడం సచిన్ టెండూల్కర్‌తో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి క్రీడా శాఖ సచిన్‌తో పాటు ధ్యాన్‌చంద్ పేరును ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రభుత్వం సచిన్‌ను మాత్రమే ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. దీంతో ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు. ధ్యాన్ చంద్ సాధించిన విజయాలను వేటితో పోల్చలేమని, ధ్యాన్ చంద్ మరణించినపుడే క్రీడాకారులకు భారత రత్న ప్రకటించే అవకాశం ఉంటే ధ్యాన్ చంద్ ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడయ్యే వాడని గోయల్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇక ధ్యాన్ చంద్ జయంతి ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆరోజే వివిధ క్రీడల్లో రాణించిన అథ్లేట్లకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్, మాజీ హాకీ ఆటగాళ్లు ధ్యాన్ చంద్‌కు భారత రత్న అవార్డు ప్రకటించాలని గతి కొద్దికాలంగా డిమాండ్ చేస్తున్నారు. -
ఘనంగా ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకునే ఈ వేడుకల సందర్భంగా నగరంలోని పలు స్టేడియాలు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించాయి. యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స అథారిటీ ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్, కరాటే, జిమ్నాస్టిక్స్, టేబుల్‌టెన్నిస్, స్కేటింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలోనూ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వాలీబాల్, హాకీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ క్రీడల సంఘం చైర్మన్ జంపన ప్రతాప్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూప్‌కుమార్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స అథారిటీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వాలీబాల్, జిమ్నాస్టిక్స్, ఖో-ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, క్రికెట్, బాక్సింగ్, టెన్నిస్ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ రాఘవ రెడ్డి, గచ్చిబౌలి ‘సాయ్’ స్పోర్ట్స కేంద్రం అసిస్టెంట్ డెరెక్టర్ ప్రభాకర్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్‌లు పాల్గొన్నారు. సరూర్‌నగర్ స్టేడియం క్రికెట్: 1. సరూర్‌నగర్ స్టేడియం, 2. హయత్‌నగర్ టీమ్. వాలీబాల్: 1. సరూర్‌నగర్ స్టేడియం, 2. షామీర్పేట్ స్టేడియం. బాక్సింగ్: సరూర్‌నగర్ స్టేడియం, 2. బాలానగర్ కబడ్డీ: 1. జడ్పీహెచ్ఎస్, సరూర్‌నగర్ 2. డీపీఎస్, దిల్సుఖ్నగర్ ఖో-ఖో: 1. జడ్పీహెచ్ఎస్, ఎల్బీనగర్, 2. డీపీఎస్, దిల్సుఖ్నగర్. జిమ్నాస్టిక్స్: 1. సరూర్‌నగర్ స్టేడియం, 2. వర్డ్ అండ్ డీడ్ స్కూల్. జింఖానా మైదానం వాలీబాల్: 1.జింఖానా, 2. ఎల్బీ స్టేడియం. హాకీ: 1. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, 2. మమత స్కూల్. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం స్కేటింగ్: 1. సాయి పర్ణిక. -
29న ధ్యాన్‌చంద్ స్మారక హాకీ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న ధ్యాన్‌చంద్ స్మారక హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ రెడ్‌హిల్స్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసక్తి గల జట్లు 27వ తేదీలోగా ఎంట్రీలు నమోదు చేసుకోవాలి. వివరాలకు హాకీ కోచ్ కె. మనోరంజన్ (9866428052)ను సంప్రదించవచ్చు. -
ధ్యాన్‌చంద్, ధోనీలపై సినిమాలు
బయోపిక్ బాటలో బాలీవుడ్ న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన ‘మేరీకోమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడంతో బాలీవుడ్ దృష్టంతా ఇప్పుడు బయోపిక్‌పైనే పడింది. మున్ముందు ఈ తరహా సినిమాలు వెల్లువెత్తనున్నాయి. ఈ సినిమాలు స్ఫూర్తిని కలిగిస్తాయని, ప్రేక్షకులను తొందరగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక సినిమా హిట్ అయినంతమాత్రాన అన్నీ విజయవంతమవుతాయనే గ్యారంటీ కూడా ఏమీలేదంటున్నారు. మహేందర్‌సింగ్ ధోనీ, ధ్యాన్‌చంద్ జీవితగాథల ఆధారంగా త్వరలో మరో రెండు బయోపిక్ సినిమాలు తెరకెక్కనున్నాయి. హాకీ లెజెండ్ జీవితగాధ ఆధారంగా కరణ్‌జోహార్ త్వరలో ఓ సినిమా తీయనున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో ధోనీ జీవితంపై సినిమా తెరకెక్క నుంది. ఈ సినిమాకు ‘అన్‌టోల్డ్ స్టోరీ’ అని నామకరణం చేశారు. ఈ సినిమాలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయమై పీవీఆర్ సంస్థ సీఈఓ దీపక్ శర్మ మాట్లాడుతూ ‘ఇందులో రహస్యమేమీ లేదు. బాక్సాఫీస్ వద్ద ఇటువంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందువల్లనే ఈ సినిమాలపై మొగ్గుచూపుతున్నాం’ అని అన్నాడు. ‘ఈ సినిమాలు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయి. అన్నిరంగాలకుచెందిన ప్రజలు ఇటువంటి వారితో తమను తాము పోల్చుకుంటుంటారు. తమ పిల్లలను ఇటువంటి సినిమాలకు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుచేతనంటే ఇవి మంచి సినిమాలనే విషయం వారికి తెలుసు. విజయవంతమైన సినిమాల బాటలోనే నడవాలని సహజంగానే అంతా కోరుకుంటారు’ అని అన్నాడు. -
భారత హాకీ జట్టు ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం
ఒకప్పుడు రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారట... రాజులనాటి ప్రాభవం గురించి చెబుతూ ఈ మాట వాడటం తరచూ వింటుంటాం. ఒకప్పుడు భారత హాకీ జట్టు అంటే ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం. ఏకంగా ఎనిమిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు నెగ్గిన ఏకైక దేశం. ప్రస్తుత భారత హాకీని నాటి వైభవంతో పోలిస్తే... అంతే అబ్బురం ఇప్పుడు. ఇతర క్రీడల జోరులో ఎదగలేక, మార్గదర్శనం కరువై మన హాకీ వెనుకబడిపోయింది. కించిత్ బాధ వెంటాడుతుంది. అయితే... అందరికీ హాకీ ఆట దూరం కాలేదు. స్టిక్ పట్టుకుంటేనే చేతిలోకి మంత్రదండం వచ్చేసినంతగా ఉప్పొంగిపోయే కుర్రాళ్లు... భవిష్యత్తుపై భరోసా లేకపోయినా హాకీ అంటే పడిచచ్చే పిల్లలు ఇంకా ఉన్నారు. ఇలాంటి ఈతరం ఆటగాళ్లతోనే హాకీ ఇంకా మనుగడ సాగిస్తోంది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజును ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నగరంలో హాకీపై అభిమానం పెంచుకున్న చిన్నారుల గురించి... సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో హాకీ ఆడేందుకు పెద్ద సంఖ్యలో చిన్నారులు వస్తుంటారు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య దాదాపు 50 వరకు ఉంటుంది. నగరంలో ఈ క్రీడకు ఇప్పుడు ఇదే కేంద్రం. గచ్చిబౌలి ఆస్ట్రో టర్ఫ్ స్టేడియంలో అవకాశమున్నా... అదంతా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ మాత్రం పేద, పెద్ద తేడా లేకుండా ఆసక్తి ఉన్న చిన్నారులంతా హాకీ ఆడేందుకు వస్తారు. ఎక్కువగా రసూల్పురావారు వచ్చేవారు. గతంలో దీని వెనుక భాగంలో బేగంపేట ఆస్ట్రోటర్ఫ్ స్టేడియం ఉండేది. అక్కడి నుంచే అనేక మంది జాతీయ స్థాయిలో హాకీ ఆడారు. అయితే బేగంపేట స్టేడియం పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు వారు జింఖానా బాట పట్టాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో... ఇక్కడి ఆటగాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న వీరిలో పది మందికి పైగా జాతీయ స్థాయి పోటీల్లో రాణించారు. అండర్-12, అండర్-14తో పాటు ప్రతిష్టాత్మక కె.డి.సింగ్ బాబు జాతీయ చాంపియన్‌షిప్‌లో కూడా వీరు పాల్గొన్నారు. నలుగురు చిన్నారులు జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీ ల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కొన్నాళ్లుగా నగరంలో సీనియర్ స్థాయి టోర్నీలు లేక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోయినా... తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదని వారు అంటున్నారు. హాకీ అంటే కొందరికి ప్రాణమని, మరికొందరికి పిచ్చి అని... అందుకే ఇదే ఆట ఎంచుకున్నామని వారు చెబుతున్నారు. ప్రోత్సాహకాలు, ఉద్యోగాల గురించి ఇప్పుడు ఆలోచన లేదని, బాగా ఆడితే అన్నీ వాటంతట అవే వస్తాయని వీరికి బలమైన నమ్మకం. టోర్నీలేవీ..! ఇక్కడి చిన్నారుల్లో చాలా ప్రతిభ ఉంది. క్లే కోర్టులోనే బాగా ఆడే వీరు అవకాశం దక్కితే ఆస్ట్రో టర్ఫ్లోనూ సత్తా చాటగలరు. సీనియర్ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహిస్తే వీరి ప్రతిభకు తగిన న్యాయం జరుగుతుంది. వీరిలో చాలా మంది ఆర్థిక స్థోమత లేనివారు. అయినా వారి పట్టుదల ముందు ఇలాంటివేవీ కనిపించవు. - కామేశ్వర రావు, హాకీ కోచ్ -
భారతరత్నకు ధ్యాన్‌చంద్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డుకు కేంద్ర హోం శాఖ హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పేరును సిఫారసు చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీరెన్ రిజ్జు ఈ విషయాన్ని లోక్‌సభలో తెలిపారు. వివిధ వర్గాల నుంచి వినతులను పరిశీలించిన అనంతరం భారతరత్న అవార్డుకు ధ్యాన్‌చంద్ పేరును సిఫారసు చేస్తూ ప్రధాని కార్యాలయానికి పంపినట్టు చెప్పారు. అయితే ఈ విషయంపై చర్చకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని కార్యాలయం సహాయం మంత్రి జితేందర్ సింగ్ తిరస్కరిచారు. గతేడాదే కేంద్ర క్రీడల శాఖ ధ్యాన్‌చంద్ పేరును సిఫారసు చేసినా చివర్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ప్రకటించారు. ప్రపంచ అత్యున్నత హాకీ ఆటగాడిగా మన్ననలందుకున్న ధ్యాన్‌చంద్ 1905లో జన్మించారు. ధ్యాన్‌చంద్ ప్రాతినిధ్యం వహించిన కాలంలో 1928-1936 మధ్య భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అప్పట్లో భారత్ ప్రపంచ హాకీని శాసించింది. 1948లో రిటైరయిన ధ్యాన్‌చంద్ పద్మభూషణ్ సహా పలు అవార్డులు స్వీకరించారు. 79 ఏళ్ల వయసులో ధ్యాన్‌చంద్ 1979లో కన్నుమూశారు. కేంద్ర క్రీడల శాఖ ధ్యాన్‌చంద్ గౌరవార్థం ఆయన పేరు మీద అవార్డు స్థాపించింది. అంతేగాక హాకీ గ్రేట్ జన్మదినం ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినంగా ప్రకటించారు. -
పద్మశ్రీ ఎందుకు ఇచ్చారో నాకు అర్దం కాలేదు: నానాపాటేకర్
గుర్గావ్: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారత రత్న లభించకపోవడంపై బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒకవేళ క్రీడాకారుడికి భారత రత్న ప్రకటిస్తే.. ముందు ధ్యాన్ చంద్ కు మాత్రమే ఇవ్వాలని నానా అభిప్రాయపడ్డారు. గుర్గావ్ సమీపంలోని కదార్ పూర్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ప్రారంభమైన జీవీ మాల్వంకర్ ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంఫియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన 'భారత రత్నకు మేజర్ ధ్యాన్ చంద్ అర్హుడు అని అన్నారు. ప్రస్తుత కాలంలో ఆటగాళ్లు డబ్బు కోసమే ఆడుతున్నారని.. దేశం కోసం ఆడటం లేదని నానా ఆరోపించారు. నాకు పద్మ శ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. బాలీవుడ్ లో డబ్బు కోసమే పనిచేశాను అని ఆయన అన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సచిన్ టెండూల్కర్ కు లభించిన సంగతి తెలిసిందే. -
క్వార్టర్స్ లో చిత్తు చిత్తు
న్యూఢిల్లీ: పునర్వైభవం కోసం పాకులాడుతున్న భారత హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో నిరాశపర్చింది. తొలి 15 నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం సంపాదించినా... తర్వాత ఆసీస్ ఎదురుదాడికి నిలువలేకపోయింది. దీంతో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఆస్ట్రేలియా 7-2తో భారత్‌ను చిత్తుగా ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున బీరేంద్ర లక్రా (6వ ని.), యువరాజ్ వాల్మీకి (11వ ని.) గోల్స్ చేయగా... నికోలస్ బడ్జెన్ (24వ ని.), జాసన్ విల్సన్ (29వ ని.), గ్లెన్ టర్నర్ (35వ ని.), రస్సెల్ ఫోర్డ్ (41, 47వ ని.), సిమన్ ఆర్కార్డ్ (45వ ని.), జాకబ్ వాటెన్ (65వ ని.) ఆసీస్‌కు గోల్స్ అందించారు. ఆట ఆరంభంలో పదునైన అటాక్‌తో ఆడిన భారత్ 20 నిమిషాల పాటు ఆధిపత్యం కొనసాగించింది. మిడ్‌ఫీల్డ్, ఫార్వర్డ్‌లైన్ సమన్వయంతో ముందుకు కదిలింది. మ్యాచ్ సాగేకొద్దీ ఆసీస్ దాడుల్లో వేగం పెంచి ఫలితాన్ని రాబట్టింది. భారత్ సర్కిల్‌లోకి సమర్థంగా దూసుకెళ్లడంతో పాటు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. దీంతో తొలి అర్ధభాగానికి 3-2 ఆధిక్యంలో నిలిచింది. ఎండ్లు మారిన తర్వాత కూడా భారత్ ఆటతీరులో మార్పు రాలేదు. ఐదు, ఎనిమిది స్థానాల కోసం శుక్రవారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... జర్మనీతో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో... ఒలింపిక్ చాంపియన్ జర్మనీపై నెదర్లాండ్స్ 2-1తో గెలిచి సెమీస్‌కు చేరింది. మ్యాచ్ తొలి నిమిషంలోనే వాన్‌డెర్ వీర్డెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి నెదర్లాండ్స్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆరో నిమిషంలో సీవ్ వాన్ యాస్ రెండో గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఒలీవర్ కాన్ (38వ ని.) ఏకైక గోల్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో బెల్జియంను ఓడించి సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్ తరఫున టామ్ కార్సన్ (47వ ని.) గోల్ చేశాడు. గట్టెక్కిన న్యూజిలాండ్ హోరాహోరీగా జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు సడెన్‌డెత్ పద్ధతి ద్వారా అర్జెంటీనాపై గెలిచి సెమీర్కు చేరింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో కేన్ రసెల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి కివీస్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే 59వ నిమిషంలో మాటియాస్ పారెడెస్ గోల్ ద్వారా అర్జెంటీనా స్కోరు సమం చేసింది. దీంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో ఐదేసి అవకాశాలకు గాను రెండు జట్లు రెండేసి గోల్స్ చేశాయి. దీంతో ఫలితం కోసం సడెన్ డెత్‌ను ఆశ్రయించారు. ఇందులో తొలి అవకాశంలో రెండు జట్లూ గోల్స్ చేశాయి. ఆ తర్వాతి అవకాశంలో అర్జెంటీనా ఆటగాడు విఫలం కాగా... న్యూజిలాండ్ ఆటగాడు హిల్టన్ గోల్ చేసి కివీస్‌ను సెమీస్‌కు చేర్చాడు. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్; ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ తలపడతాయి. -
ధ్యాన్‌చంద్‌కు భారతరత్నపై రేపు అభిమానుల ర్యాలీ
న్యూఢిల్లీ: హాకీ విజార్డ్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ హాకీ సిటిజన్ గ్రూప్ అనే ఓ ఎన్జీవో రేపు దేశ రాజధాని ఢిల్లీలో ర్యాలీ నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు బారాఖంబా దగ్గర మొదలయ్యే ర్యాలీ జంతర్‌మంతర్ వరకూ సాగనుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో ఓ మెమొరాండమ్ అందించనున్నారు. క్రీడాభిమానులు, హాకీ ఆటగాళ్లు, కోచ్‌లు, ఆడ్మినిస్ట్రేటర్లందరూ ఈ ర్యాలీకి తరలి రావాలని ఆ సంస్థ కోరుతోంది. సచిన్‌తో పాటు ధ్యాన్‌చంద్‌కు కూడా ఈసారి భారతరత్న ఇవ్వాలని ఈ ఎన్జీవో డిమాండ్ చేస్తోంది. ఈ ర్యాలీలో ధ్యాన్‌చంద్ కుమారుడు అశోక్‌కుమార్‌తో పాటు ఎంతోమంది మాజీ ఒలింపిక్ ఆటగాళ్లు పాల్గొననున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో చెప్పింది. -
ధ్యాన్‌చంద్‌కూ ‘భారతరత్న’!
సంగ్రూర్ (పంజాబ్): ప్రతిష్టాత్మక పౌరపురస్కారం ‘భారతరత్న’ను హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కూ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. ఇక్కడి వార్ హీరోస్ స్టేడియంలో రూ. 6.87 కోట్లతో నిర్మించనున్న సింథటిక్ ట్రాక్ శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వచ్చే ఒలింపిక్స్‌లో తమ అథ్లెట్లు భారత జాతీయ జెండా కిందనే పోటీల్లో పాల్గొంటారన్నారు. బర్నాలలోని ఎస్డీ కాలేజి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఎక్స్టెన్షన్ సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న ఇలాంటి సెంటర్లను ప్రతీ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు మంత్రి చొరవ చూపాలని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విజయ్ ఇందర్ సింగ్లా కోరారు. -
భారతరత్నకు సచిన్ అర్హుడే
నోయిడా: ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకునే అర్హత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఉందని అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువతకు అతడు మార్గదర్శకుడని కొనియాడారు. ఓ క్రికెటర్‌గా విజయవంతమవడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా తోటి ఆటగాళ్లకన్నా ముందున్నాడన్నారు. అయితే తనకన్నా ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు ఈ ఘనత దక్కితే బాగుండేదని అన్నారు. పలు అంశాలపై మిల్కా అభిప్రాయలు ఆయన మాటల్లోనే... సచిన్ వినయం అపూర్వం: చాన్నాళ్లుగా సచిన్ ఆదర్శప్రాయుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు నేను అతడిని కలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా నా పాదాలకు నమస్కరిస్తాడు. ముందు ధ్యాన్‌చంద్‌కు ఇవ్వాల్సింది: సచిన్‌కు భారతరత్న ఇవ్వడంలో నాకెలాంటి వ్యతిరేకత లేదు. అయితే ముందుగా ఈ అవార్డును దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ క్రీడాలోకంలో భారత పతాకాన్ని ఎగిరేలా చేసిన హాకీ వీరుడు ధ్యాన్‌చంద్‌కు ఇస్తే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికైనా ఈ అవార్డు ఆయనకు దక్కాలి. మొత్తానికి ఆటగాళ్లకు ‘భారతరత్న’ ద్వారాలు తెరుచుకోవడం సంతోషకరం. క్రీడాకారులను గవర్నర్లుగా నియమించాలి: దేశంలో చాలామంది క్రీడాకారులకు మంచి విజ్ఞానం ఉంది. వారిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా లేక రాయబారులుగా నియమించాలి. మీడియాకు క్రికెట్ అంటేనే మోజు: క్రికెట్ గురించి మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తుంటుంది. అయితే మా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లు, ఐఓఏ కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆటగాళ్ల గురించి క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. -
'సచిన్‌కు ఓకే! మరి ద్యాన్‌చంద్ సంగతి?'
-
ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌కు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఘన నివాళి అర్పించారు. ఆయన 108వ జయంతి సందర్భంగా దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి శాప్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, శాప్ ఎండీ రాహుల్ బొజ్జ, క్రీడాశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హాకీ మ్యాచ్ నిర్వహించారు. న్యూఢిల్లీలో ధ్యాన్‌చంద్‌పై తొలిసారి గ్రాఫిక్స్ రూపంలో జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ‘ధ్యాన్‌చంద్-ది విజార్డ్ ఆఫ్ హాకీ’ పేరుతో రూపొందిన ఈ పుస్తకాన్ని గురువారం ఆయన 108వ జయంతి సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశి థరూర్ ఆవిష్కరించారు. ఒక క్రీడాకారుడిపై గ్రాఫిక్స్ రూపంలో పుస్తకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో ధ్యాన్‌చంద్ అద్భుత ప్రదర్శనతో పాటు భారత్ తరఫున ఆయన సాధించిన ఘనతలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు. కామిక్ సిరీస్‌లు ప్రచురించడంలో గుర్తింపు ఉన్న అమర్ చిత్ ్రకథా సంపుటినుంచే ధ్యాన్‌చంద్ పుస్తకం కూడా వెలువడింది. ‘చిన్నారులకు స్ఫూర్తినిచ్చేందుకు ధ్యాన్‌చంద్ సరైన వ్యక్తి. ఆయన గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలన్నదే మా ఆలోచన. ఇది ఆ మహనీయుడికి ఇస్తున్న నివాళిలాంటిది’ అని అమర్ చిత్రకథ ఎడిటర్ రీనాపురి చెప్పారు. హాకీ దిగ్గజంపై అనేక పరిశోధనలు చేసిన లూయిస్ ఫెర్నాండెజ్ స్క్రిప్ట్ రాసిన ఈ పుస్తకం వంద రూపాయల ధరకు మార్కెట్లో లభిస్తుంది. -
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
దేశంలో నేడు ఆటలకు పండుగ రోజు. ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశంలో క్రమంగా క్రీడా సంస్కృతి పెరుగుతోంది. కెరీర్‌గా ఎంచుకుంటేనే క్రీడల వైపు చూసే పరిస్థితి నుంచి... ‘ఆట ఆరోగ్యం కోసం’ అనే భావన క్రమంగా పెరుగుతోంది. ఒక్క క్రికెట్లోనే కాకుండా అంతర్జాతీయ యవనికపై భారత్‌కు అన్ని క్రీడల్లోనూ విజయాలు పెరుగుతున్నాయి. క్రీడా దినోత్సవం, ఆటల ప్రాధాన్యత, మార్గదర్శనం, భవిష్యత్... ఇలా అనేక అంశాలపై ముగ్గురు ఆంధ్రప్రదేశ్ క్రీడా దిగ్గజాలు ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు...