ధ్యాన్‌చంద్‌కు భారతరత్నపై రేపు అభిమానుల ర్యాలీ | Fans to rally for Bharat Ratna for Dhyan Chand | Sakshi
Sakshi News home page

ధ్యాన్‌చంద్‌కు భారతరత్నపై రేపు అభిమానుల ర్యాలీ

Published Tue, Jan 7 2014 3:44 PM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

Fans to rally for Bharat Ratna for Dhyan Chand

న్యూఢిల్లీ: హాకీ విజార్డ్‌ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ హాకీ సిటిజన్‌ గ్రూప్‌ అనే ఓ ఎన్జీవో రేపు దేశ రాజధాని ఢిల్లీలో ర్యాలీ నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు బారాఖంబా దగ్గర మొదలయ్యే ర్యాలీ జంతర్‌మంతర్‌ వరకూ సాగనుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో ఓ మెమొరాండమ్‌ అందించనున్నారు. క్రీడాభిమానులు, హాకీ ఆటగాళ్లు, కోచ్‌లు, ఆడ్మినిస్ట్రేటర్లందరూ ఈ ర్యాలీకి తరలి రావాలని ఆ సంస్థ కోరుతోంది.

 

సచిన్‌తో పాటు ధ్యాన్‌చంద్‌కు కూడా ఈసారి భారతరత్న ఇవ్వాలని ఈ ఎన్జీవో డిమాండ్‌ చేస్తోంది. ఈ ర్యాలీలో ధ్యాన్‌చంద్‌ కుమారుడు అశోక్‌కుమార్‌తో పాటు ఎంతోమంది మాజీ ఒలింపిక్‌ ఆటగాళ్లు పాల్గొననున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement