ఘనంగా ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు | dhyanchands birth Anniversary celebrated | Sakshi
Sakshi News home page

ఘనంగా ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు

Published Tue, Aug 30 2016 11:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

dhyanchands birth Anniversary celebrated

సాక్షి, హైదరాబాద్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకునే ఈ వేడుకల సందర్భంగా నగరంలోని పలు స్టేడియాలు వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించాయి. యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో తెలంగాణ స్పోర్‌‌ట్స అథారిటీ ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్, కరాటే, జిమ్నాస్టిక్స్, టేబుల్‌టెన్నిస్, స్కేటింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలోనూ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు జరిగాయి.

 

ఈ సందర్భంగా వాలీబాల్, హాకీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ క్రీడల సంఘం చైర్మన్ జంపన ప్రతాప్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూప్‌కుమార్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. రంగారెడ్డి జిల్లా స్పోర్‌‌ట్స అథారిటీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వాలీబాల్, జిమ్నాస్టిక్స్, ఖో-ఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, క్రికెట్, బాక్సింగ్, టెన్నిస్ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ రాఘవ రెడ్డి, గచ్చిబౌలి ‘సాయ్’ స్పోర్‌‌ట్స కేంద్రం అసిస్టెంట్ డెరెక్టర్ ప్రభాకర్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్‌లు పాల్గొన్నారు.

సరూర్‌నగర్ స్టేడియం
 క్రికెట్: 1. సరూర్‌నగర్ స్టేడియం, 2. హయత్‌నగర్ టీమ్.
 వాలీబాల్: 1. సరూర్‌నగర్ స్టేడియం, 2. షామీర్‌పేట్ స్టేడియం.
 బాక్సింగ్: సరూర్‌నగర్ స్టేడియం, 2. బాలానగర్
 కబడ్డీ: 1. జడ్పీహెచ్‌ఎస్, సరూర్‌నగర్ 2. డీపీఎస్, దిల్‌సుఖ్‌నగర్
 ఖో-ఖో: 1. జడ్పీహెచ్‌ఎస్, ఎల్బీనగర్, 2. డీపీఎస్, దిల్‌సుఖ్‌నగర్.
 జిమ్నాస్టిక్స్: 1. సరూర్‌నగర్ స్టేడియం, 2. వర్డ్ అండ్ డీడ్ స్కూల్.
 జింఖానా మైదానం
 వాలీబాల్: 1.జింఖానా, 2. ఎల్బీ స్టేడియం.
 హాకీ: 1. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, 2. మమత స్కూల్.
 కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం
 స్కేటింగ్: 1. సాయి పర్ణిక.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement