పద్మశ్రీ ఎందుకు ఇచ్చారో నాకు అర్దం కాలేదు: నానాపాటేకర్
పద్మశ్రీ ఎందుకు ఇచ్చారో నాకు అర్దం కాలేదు: నానాపాటేకర్
Published Mon, Feb 17 2014 9:19 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
గుర్గావ్: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారత రత్న లభించకపోవడంపై బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒకవేళ క్రీడాకారుడికి భారత రత్న ప్రకటిస్తే.. ముందు ధ్యాన్ చంద్ కు మాత్రమే ఇవ్వాలని నానా అభిప్రాయపడ్డారు.
గుర్గావ్ సమీపంలోని కదార్ పూర్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ప్రారంభమైన జీవీ మాల్వంకర్ ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంఫియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన 'భారత రత్నకు మేజర్ ధ్యాన్ చంద్ అర్హుడు అని అన్నారు.
ప్రస్తుత కాలంలో ఆటగాళ్లు డబ్బు కోసమే ఆడుతున్నారని.. దేశం కోసం ఆడటం లేదని నానా ఆరోపించారు. నాకు పద్మ శ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదని ఆయన ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. బాలీవుడ్ లో డబ్బు కోసమే పనిచేశాను అని ఆయన అన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సచిన్ టెండూల్కర్ కు లభించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement