![విజేతలతో వరంగల్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు](/styles/webp/s3/article_images/2017/09/5/71488972216_625x300.jpg.webp?itok=jrDdmjlC)
విజేతలతో వరంగల్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో హైదరాబాద్ సిటీ పురుషుల పోలీస్ జట్టు జూడోలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. వరంగల్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 90 కేజీల కేటగిరీలో శివకృష్ణ (హైదరాబాద్) బంగారు పతకం సాధించగా, 100 కేజీల కేటగిరీలో సి. వెంకటేశ్ కాంస్యం, ప్లస్ 100 కేజీ కేటగిరీలో అశ్విన్ స్వర్ణం గెలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు విజేతలకు పతకాలు అంజదేశారు.
జూడో ఫలితాలు
పురుషుల 81 కేజీలు: 1. గణేష్ (టీఎస్‌ఎస్‌పీ), 2. మధు (నిజామాబాద్), 3. వెంకటేశ్ (హైదరాబాద్ సిటీ); 90 కేజీలు: 1. శివకృష్ణ (హైదరాబాద్ సిటీ), 2. రమేష్ (వరంగల్ సిటీ), 3. శ్రీనివాస్ (టీఎస్‌ఎస్‌పీ); 100 కేజీలు: 1. నజీర్ (కరీంనగర్ రేంజ్), 2. నవీన్ (వరంగల్ సిటీ), 3. వెంకటేశ్ (హైదరాబాద్ సిటీ); ప్లస్ 100 కేజీలు: 1. అశ్విన్ కుమార్ (హైదరాబాద్ సిటీ), 2. రాజు (వరంగల్ రేంజ్), 3. ప్రసాద్ (టీఎస్‌పీఏ).