గోవా: అండర్-25 వన్డే టోర్నీ (పీఎస్ రామ్మోహనరావు ట్రోఫీ)లో హైదరాబాద్‌కు చుక్కెదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో గోవా 99 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
కె. మిత్రా (47), సమర్ దుబాషి (38), వేదాంత్ (28) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో యష్ పురి 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్ సనా 2 వికెట్లు తీశాడు. అనంతరం హైదరాబాద్ 39.2 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ రాయుడు (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వేదాంత్ నాయక్ (6/39) చెలరేగి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శ్రీనివాస్‌కు 2 వికెట్లు దక్కాయి.
అండర్-25 వన్డే టోర్నీ: హైదరాబాద్ చిత్తు
Published Fri, Feb 28 2014 11:46 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement