సెపక్‌తక్రా పోటీల్లో హైదరాబాద్ జట్ల ముందంజ | hyderabad teams lead in interstate sepak takraw tounry | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రా పోటీల్లో హైదరాబాద్ జట్ల ముందంజ

Published Sun, Aug 28 2016 11:54 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

hyderabad teams lead in interstate sepak takraw tounry

అంతర్ జిల్లా సెపక్‌తక్రా చాంపియన్‌షిప్  
 
 సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సెపక్‌తక్రా పోటీల్లో హైదరాబాద్ జట్లు ముందంజ వేశాయి. చందానగర్‌లోని పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర రెగూ ఈవెంట్‌లో హైదరాబాద్  2-0 (21-13, 21-8)తో నిజామాబాద్‌పై గెలుపొందగా... బాలికల విభాగంలో హైదరాబాద్  2-0 (21-9, 21-9)తో కరీంనగర్ జట్టును ఓడించింది. ఇతర బాలుర మ్యాచ్‌ల్లో మహబూబ్‌నగర్ 2-0 (21-18, 21-18)తో వరంగల్‌పై, నల్లగొండ 2-0 (21-18, 22-21) తో ఆదిలాబాద్‌పై, ఖమ్మం 2-0 (21-18, 21-15)తో ఆదిలాబాద్‌పై, మహబూబ్‌నగర్ 2-1 (21-16, 17-21, 21-13)తో నల్లగొండపై, ఖమ్మం 2-1 (21-15, 16-21, 21-7)తో వరంగల్‌పై, మెదక్ 2-0 (22-20, 21-18)తో రంగారెడ్డిపై విజయం సాధించాయి.

 బాలికల ఫలితాలు: నిజామాబాద్ 2-0 (21-11, 21-13)తో ఖమ్మంపై, మెదక్ 2-0 (21-14, 21-9)తో కరీంనగర్‌పై, మెదక్ 2-0 (21-6, 21-6)తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 2-0 (21-10, 21-3)తో ఖమ్మంపై, మెదక్ 2-0 (21-14, 21-9)తో కరీంనగర్‌పై, కరీంనగర్ 2-0 (21-5, 21-11)తో ఖమ్మంపై, హైదరాబాద్ 2-0 (21-13, 31-7)తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 2-0 (21-17, 22-20)తో మెదక్‌పై, నల్లగొండ 2-0 (21-14, 21-10)తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ 2-0 (21-7, 21-15)తో వరంగల్, రంగారెడ్డి 2-0 (21-5, 21-1)తో వరంగల్‌పై, నల్లగొండ 2-0 (21-10, 21-16)తో ఆదిలాబాద్‌పై, ఆదిలాబాద్ 2-0 (21-12, 21-5)తో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 2-0 (21-13, 21-7)తో నల్లగొండపై, రంగారెడ్డి 2-0 (21-13, 21-9)తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 2-0 (21-15, 21-7)తో మహబూబ్‌నగర్‌పై గెలుపొందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement